బిగ్ అప్డేట్ : ఓటిటిలో “సర్కారు వారి పాట” అసలు రిలీజ్ డేట్ వచ్చేసింది.!

 Sarkaru Vaari Paata

ఈ ఏడాది టాలీవుడ్ లో వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో భారీ హిట్ చిత్రం “సర్కారు వారి పాట” కూడా ఒకటి. దర్శకుడు పరశురామ్ పెట్ల మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో ఫస్ట్ టైం వచ్చిన సినిమా ఇది కావడంతో మంచి అంచనాలు నడుమే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. 

అయితే ఈ సినిమా థియేటర్స్ లో భారీ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం ఫైనల్ గా అయితే లాభాలను అందించిందో లేదో క్లారిటీ రాకుండానే మిగిలిపోయింది. ఇక ఇది పక్కన పెడితే ఆల్రెడీ థియేటర్స్ లో ఉండగానే ఓటిటి లో ఈ చిత్రం పైడ్ విధంగా స్ట్రీమింగ్ కి వచ్చింది. 

కానీ ఫ్రీ స్ట్రీమింగ్ కి మాత్రం ఎప్పుడు నుంచి వస్తుందో ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని ఈ జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా బిగ్ అప్డేట్ అందించారు. 

అయితే ఇది బిగ్ అప్డేట్ ఎందుకు అయ్యిందంటే తెలుగుతో పాటుగా తమిళ్ మరియు మలయాళం భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మహేష్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అలాగే 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.