Kodali Nani: వైసీపీకి మరో షాక్…. రాజీనామాకు సిద్ధమైన ఫైర్ బ్రాండ్ కొడాలి నాని… పోస్ట్ వైరల్?

Kodali Nani: కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది వైకాపాకీలక నాయకులు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి లేదా బిజెపిలోకి వలసలు వెళుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే ఎవరు ఊహించని విధంగా వైయస్సార్సీపి ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాలకు రాజీనామా ప్రకటించడం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది.

వైకాపా పార్టీ వ్యవహారాలన్నింటిని చెక్క దిద్దుతూ, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగాను ఆప్తుడు గాను ఉన్నటువంటి విజయ్ సాయి రెడ్డి ఇలా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఇక తాను ఏ పార్టీలోకి చేరాలని కోరుకోవడం లేదని వ్యవసాయం చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతానని ఈయన చెప్పటం రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు కారణమవుతుంది. ఇలా విజయసాయిరెడ్డి రాజీనామా అనేది వైకాపా నాయకులు కార్యకర్తలకు ఊహించని షాక్ అని చెప్పాలి.

ఇలా విజయసాయిరెడ్డి రాజీనామాతో షాక్ లో ఉన్నటువంటి నేతలకు మరో బిగ్ షాక్ తగలబోతోందని చెప్పాలి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి నేత కొడాలి నాని సైతం విజయ్ సాయి రెడ్డి బాటలోని రాజీనామా చేయటనికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా ఈనెల 25వ తేదీ తాను కూడా రాజీనామా చేస్తూ రాజకీయాలకు దూరం కాబోతున్ననని తెలియజేశారు.

ప్రస్తుతం తాను అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, నన్ను ఎంతగానో అభిమానించిన గుడివాడ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఈ పోస్ట్ పై కొడాలి నాని స్పందించారు.

నేను రాజకీయాలకు దూరం అవుతున్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుంది. అయితే అది ఫేక్ ఎడిటెడ్ పోస్ట్ అంటూ ఈయన తెలియజేశారు. తాను అనారోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరమవుతానని ఈ పోస్టు చక్కర్లు కొడుతుంది ఇందులో ఏమాత్రం నిజం లేదని కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ పోస్ట్ చేశారని తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రజలు ఎవరు నమ్మదు అంటూ ఈయన ఈ వార్తలను ఖండించారు.