Keerthy Suresh: టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట నేను శైలజా సినిమాతో హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా తెలుగులో సర్కారు వారి పాట, దసరా,మహానటి, రెమో, రంగ్ దే, ఏజెంట్ భైరవ, నేను లోకల్, గుడ్ లక్ సఖి ఇలాంటి చాలా సినిమాలు నటించి మెప్పించింది.
ముఖ్యంగా తెలుగులో మహానటి సినిమాతో భారీగా క్రేజ్ ని గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా భారీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే కీర్తి సురేష్ ఇటీవలే మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆంటోనీ తట్టిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు కీర్తి సురేష్.
అయితే పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత మొట్టమొదటిసారి తన భర్త ఆంటోనీ తట్టిల్, అతని ఫ్యామిలీతో కలిసి మొదటిసారి ఓనం పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు కీర్తి సురేష్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Keerthy Suresh: పెళ్లి తర్వాత మొదటిసారి భర్తతో కలిసి ఓనం సెలబ్రేట్ చేసుకున్న కీర్తి సురేష్.. ఫోటోస్ వైరల్!
