Gallery

Home News ఈటెలపై నాగార్జునసాగర్ ప్లాన్ వేస్తోన్న కేసీఆర్..

ఈటెలపై నాగార్జునసాగర్ ప్లాన్ వేస్తోన్న కేసీఆర్..

Kcr'S Master Plan In Huzurabad Against Etela

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒకింత సీరియస్ యాక్షన్ ప్లాన్ రచిస్తున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా రంగంలోకి దిగి ‘ఆపరేషన్ హుజూరాబాద్’ నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అత్యంత వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ మీద వేటు వేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే, ఈటెల తలెత్తుకోలేనంత పరాజయాన్ని ఆయనకు అందించాలని తహతహలాడుతున్నారట.

మొత్తంగా మంత్రులంతా హుజూరాబాద్ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టాలని ఇప్పటికే కేసీఆర్ ఆదేశించినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఆ మధ్య జరిగిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి బోల్తాపడింది. గ్రేటర్ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గట్టెక్కింది. దాంతో, కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికను డీల్ చేశారు. మంచి ఫలితాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అందుకుంది. అదే మోడల్, హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ అప్లయ్ చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది.

ఆ పని ఇప్పటినుంచే మొదలు పెట్టేయాలన్న నిర్ణయానికి వచ్చిన కేసీఆర్, పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే ఈ విషయమై చర్చించి, తగిన ఆదేశాలు కూడా జారీ చేశారట. ‘హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే, బంపర్ మెజార్టీతో విజయం సాధించాలి.. ఈటెలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలంటే, రికార్డు మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితి గెలవడమొక్కటే మార్గం..’ అంటున్నారట గులాబీ బాస్.

అయితే, ఈటెలని అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి లేదు. ఆయన కూడా ఉద్యమ నాయకుడే. ఆయనకీ పక్కా వ్యూహాలున్నాయి. సో, ఉప ఎన్నిక యుద్ధం అంటూ మొదలైతే, హుజూరాబాద్ నియోజకవర్గం.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పేంత హాటు హాటుగా జరగబోతోందన్నమాట.

- Advertisement -

Related Posts

పోరు గడ్డపై ఉప పోరు

ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ. ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కూడా అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు కూడా కరీంనగర్నే సెంటిమెంట్ జిల్లాగా ఎంచుకున్నాడు. ఇక్కడి నుంచే మలి...

కేంద్ర మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్.. అంత సీన్ వుందా.?

గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని అరడజను సీట్లలో పోటీ చేసే అవకాశమూ దక్కించుకోలేకపోయింది జనసేన పార్టీ. బీజేపీ కంటే ఓట్ల శాతం పరంగా మెరుగ్గానే వున్నా, తిరుపతి ఎంపీ టిక్కెట్టుని...

యాక్షన్ షురూ చేసిన సీఎం జగన్ ! త్వరలో ‘RRR’పై వేటు ఖాయం !

గత కొంతకాలం నుండి వైసీపీ పార్టీ, సీఎం జగన్ మీద సొంత పార్టీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు ఎదురుదాడి చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధ్యక్షుడు మిన్నకుండి పోవటంతో నాయకుల,...

Latest News