వింటున్నారా కేసీఆర్ గారు ఆలోచించుకోండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవట..??

 

ఏం మనుషులయ్యా మీరు సాక్షాత్తు తెలంగాణ సీయం కూతురు ఇంత ఘోరంగా ఓడిపోతే నాకు ఎంత తలవంపు.. మీరంతా ఏం చేస్తున్నారయ్య.. ఇది నాడు నిజమాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓడిపోయినప్పుడు ప్రచారంలోకి వచ్చిన మాటలట.. ఇక అప్పటి నుండి తెలంగాణ ఆడపడచు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చింది.. ఆసమయంలో పదవులుంటేనే ప్రజలు కావాలా లేకుంటే వద్దా అనే గుసగుసల ప్రచారం కూడా జరిగింది..

kcr kavitha telugu rajyam

ఇక కేటీయార్ గారైతే చెల్లని నోటు కోసం చెప్పిన వ్యాఖ్యాలు సొషల్ మీడియాలో తెగహల్ చల్ చేస్తున్నాయి.. చెల్లని నోటు ఏ దుకాణంలోకి వెళ్లిన చెల్లదు.. తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్లా.. ఓడిపోయిన నాయకులను తీసుకువచ్చి ఎలక్షన్లో నిలబెడితే గెలిపించడానికి అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.. ప్రస్తుతం తెలంగాణ సీయం కూతురు కవితమ్మ విషయంలో ఈ వార్త నిజం అయ్యిందంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారట..

అదీగాక కూతురు కవితను ఎమ్మెల్సీగా గెలిపించుకోవడంతో పాటు, మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారట కేసీఆర్.. ఇప్పటికే కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి ఉందట. అదీగాక ఇక్కడ దొరల కుటుంబపాలన కొనసాగుతుందనే విమర్శలూ ఉన్నాయి. ఈ నిప్పుకు ఉప్పు తోడైనట్లుగా గ్రామస్థాయి పనుల నుంచి భారీ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వరకు అన్నీ కేసీఆర్ కుటుంబీకులు, బంధువులకే దక్కుతున్నాయనే అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయట. అంటే బంగారు తెలంగాణ అని భ్రమించిన ప్రజలకు కేసీయార్ కుటుంబ తెలంగాణ అయ్యిందంటూ ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు దెప్పిపొడుస్తున్న విషయం తెలిసిందే..

ఇలాంటి టైమ్ లో కూతురు కవితను కేబినెట్ లోకి తీసుకుంటే కేసీఆర్ కు అదనపు తలనొప్పులు తప్ప, కలిసొచ్చేదేం లేదు అని విశ్లేషకుల అభిప్రాయం అంటా.. కానీ ఇవేమి లెక్కచేయని గులాభి దళం అధినేత ఆర్టీసీ ఉద్యమం ద్వారా, నిరుద్యోగుల నుంచి వచ్చిన వ్యతిరేకత.. లాంటి పెద్ద పెద్ద సమస్యల్నే అధిగమించి నా లెక్కలు నాకుంటాయని నిరూపించాడు. ఎవరు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా.. ఎన్నికల టైమ్ కి స్థానికతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోగల సమర్థుడని పొగిడే వారు కూడా లేకపోలేదు.. కాబట్టి కవిత ద్వారా వచ్చే తలనొప్పులు ఆయన్ను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. కాకపోతే దొడ్డిదారిన కూతుర్ని మినిస్టర్ చేశారనే అపవాదును మాత్రం ఆయన జీవితాంతం మోయవలసి వస్తుందని అంటున్నారట కొందరు నాయకులు.. అందుకే వింటున్నారా కేసీఆర్ గారు ఈ విషయంలో మరొక్కసారి ఆలోచించి అడుగేయండని అంటూన్నారు..