అప్పుడు భలే చెప్పావుగా కేటీఆర్… కానీ ఇప్పుడు నువ్వు చేసిందేంటి?

KTR

రాజకీయ నాయకుల నిజాయితీ గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదు,అసలు వ్యక్తిత్వం ఏమిటో తెలియదు గాని రాజకీయంలోకి దిగాక ఊసరవెల్లి మాదిరిగా మారిపోతారు.సమయానికి తగ్గట్లు సిద్ధాంతాలు వల్లించే అలవాటు టీఆర్ఎస్ నేతలకు కాస్త ఎక్కువ. అందులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్,కేటీఆర్ లకు ఈ అలవాటు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తమకు తగ్గట్లుగా.. అప్పటికప్పుడు ఒక థియరీని తయారు చేసి ప్రజలకు చెప్పేస్తుంటారు. దాని ముందు వెనుక గురించి పట్టించుకోరు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక సందర్భంలో ఎన్నికల్లో ఓడిన వారిని.. ఆ వెంటనే వచ్చే ఎన్నికల బరిలో దించటంలో ఏమైనా అర్థముందా? అని కేటీర్ ప్రశ్నించటం జరిగింది.

KTR
KTR

2018 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారిని.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపటాన్ని తప్పు పట్టారు. ప్రజలు రిజెక్టు చేసిన వారికి మళ్లీ టికెట్లు ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభల్లోఈ అంశాన్ని తరచూ ప్రస్తావించేవారు మంత్రి కేటీఆర్.

KAVITHA won as mlc in nizamabad
kavitha-kalvakuntla

ఆయన చెప్పిన సూత్రం ప్రకారం, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిన కవితకు.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదుగా. అందుకు భిన్నంగా తాజా ఉప ఎన్నికల్లోపోటీ చేసి,90శాతం ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు కవిత. మరి.. కేటీఆర్ థియరీకి భిన్నంగా చోటు చేసుకున్నఈ పరిణామంపై ఆయనేమంటారో . సమయానికి తగ్గట్లు చెప్పిన థియరీని చెత్తబుట్టలో వేసేస్తారా? తమ అవసరాలకు తెర మీదకు తీసుకొచ్చి చెప్పే ఈ మాటల్ని ఇక్కడితో ఆపేస్తారా? సరికొత్తగా మళ్లీ మొదలు పెడతారా? అన్నది చూడాలి. ఎందుకంటే.. చెల్లని నాణెం ఎక్కడా చెల్లకూడదన్న కేటీఆర్ మాటకలు భిన్నంగా.. తాజా ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున చెల్లుబాటు కావటంపై ఆయనిప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.