Kapu Party : ‘కాపు’ పార్టీతో జనసేనకు కొత్తగా వచ్చే నష్టమేంటి.?

Kapu Party : తెలుగుదేశం పార్టీని కమ్మ పార్టీగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రెడ్డి పార్టీగా అభివర్ణించే కొందరు రాజకీయ పరిశీలకులు, జనసేన పార్టీ మీద ‘కాపు’ ముద్ర వేయడం మామూలే. అసలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని వదిలేసి, రెల్లి కులాన్ని స్వీకరించారు గనుక, జనసేన కాపు పార్టీ కాదు, రెల్లి పార్టీ.. అంటూ, ‘కమ్మ’ మీడియా కొత్త వాదనను తెరపైకి తెచ్చిందనుకోండి.. అది వేరే సంగతి.

రాజకీయాల్లో మేధావితనం ఈ స్థాయికి దిగజారిపోయింది మరి.! కాగా, కొత్తగా ‘కాపు’ పార్టీ పుట్టబోతోందట, దానికి ముద్రగడ పద్మనాభం నాయకత్వం వహించబోతున్నారట.. అంటూ కొత్త, వింత ప్రచారం జోరందుకుంది. ముద్రగడ పద్మనాభంకి ఓట్లు రాబట్టేంత సీన్ వుందా.? కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్క చోట కూర్చుని, రాజకీయాలపై చర్చిస్తే, కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొస్తుందా.?

సపోజ్, ఫర్ సపోజ్.. కొత్త కాపు పార్టీ వచ్చిందనే అనుకుందాం. దానివల్ల జనసేన పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏముంటుంది.? జనసేన పార్టీ నిండా మునిగిపోయింది. రాజకీయ పార్టీ అన్నాక రాజకీయం చేయాలిగానీ, జనసేన పార్టీ చిత్ర విచిత్రమైన, అర్థరహితమైన రాజకీయాలు చేస్తూ చతికిలపడింది.

2014 ఎన్నికల సమయంలోనే జనసేన పార్టీ తరఫున ప్రజా ప్రతినిథులు వుండేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసి వుండాలి. జీరో బడ్జెట్ రాజకీయాలు.. మార్పు కోసం రాజకీయాలంటూ ‘సొల్లు పురాణం’ చెబితే, అది జనానికీ అర్థం కాలేదు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులకీ నచ్చలేదు.

అయిపోయింది, 2019 ఎన్నికలతో మొత్తంగా జనసేన పరిస్థితి దిగజారిపోయింది. ఇక, ఇప్పుడు కొత్తగా వచ్చే కాపు పార్టీ (నిజంగా వస్తందో లేదో తెలియదు) వచ్చినా, దానికి ఛరిష్మాటిక్ లీడర్ వుండాలి కదా.? సో, జనసేనకి వున్న ఆ నాలుగైదు శాతం ఓట్ల నుంచి ఓ అరశాతమో, పావు శాతమో.. తగ్గుతుందేమో తప్ప, అంతకన్నా పెద్ద నష్టమైతే వుండకపోవచ్చు.