Kamal Hasan: ప్రముఖ కోలీవుడ్ నటుడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు . ఈ క్రమంలో సొంత రాజకీయ పార్టీ పెట్టి ఆ పనులలో చాలా బిజీగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత కమల్ హాసన్ విక్రమ్ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల విడుదలైన విక్రమ్ సినిమా తెలుగు తమిళ భాషలతో పాటు ఇతర భాషలలో కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం విక్రమ్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ ఇటీవల తన సొంత పార్టీ తరపున నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. విక్రమ్ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా ఒక లక్ష కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టింది. దీంతో కమల్ హాసన్ ఆనందం వ్యక్తం చేస్తూ.. గతంలో తాను చేసిన అప్పులు అన్ని తేర్చేసి సంతోషంగా ఉంటానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ రక్తదాన కార్యక్రమంలో తన పార్టీకి సంబంధించిన నేతలలో ఒక వ్యక్తి మాట్లాడుతుండగా కమల్ హాసన్ అభిమాని వెనకనుండి విక్రమ్ విక్రమ్ అని గట్టిగా అరవటం మొదలు పెట్టారు. దీంతో కమల్ హాసన్ అతని వైపు వేలు చూపిస్తూ అలా చేయద్దు అంటూ చాలా సీరియస్ అయ్యాడు.
అయితే కమల్ హాసన్ అలా సీరియస్ అవ్వటం వెనుక కూడా పెద్ద కారణం ఉంది. తమిళ్ భాషలో విక్రం అంటే అమ్మటం అని అర్థం . అక్కడ పార్టీ తరపున 4 లక్షల లీటర్ల రక్తాన్ని ఉచితంగా అందించటం కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ కార్యక్రమంలో రక్తదానం గురించి మాట్లాడుతున్న సమయంలో ఇలా విక్రం అని అరవటం వల్ల రక్తాన్ని అమ్ముతున్నట్టు అర్థం వస్తుంది. దీంతో ప్రజలు డబ్బుకోసం రక్తం అమ్ముతున్నారని అపోహ పడతారు. అందువల్ల అభిమాని చేసిన పనికి కమల్ హాసన్ అలా సీరియస్ అయ్యాడు.