AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనకు వెళ్లడంతో అక్కడ కొంతమంది కార్యకర్తలు అతి ఉత్సాహం ప్రదర్శించారు. ఏకంగా 2029 లో మేము అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్టు రప్ప రప్ప నరికేస్తాం అంటూ పట్టుకున్న ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. ఫ్లెక్సీ ల పై ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే డైలాగును ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమంలో కూడా చెప్పడంతో పలువురు కూటమి ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు.
ఈ క్రమంలోనే మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఈ విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. శవాల పునాదులపైనే పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ అంటూ ఈయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఆయన బయటకు రావాలంటే ఎవరైనా చావాలి. లేదంటే చంపేందుకు వస్తారు.అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరుకుతాం అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించేలా సైకో బ్యాచ్‌ను జగన్ రెచ్చగొడుతున్నారు.
ఒక మాజీ సీఎం అయ్యుండుకొని కార్యకర్తలకు సూచించేది ఇదేనా అంటూ ప్రశ్నించారు.ఇక్కడున్న వాళ్లకూ చేతులు, కొడవళ్లు ఉంటాయని గుర్తుంచుకోవాలి. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను చూసి లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా జగన్ వ్యవహరిస్తున్నారు.. రెడ్ బుక్ సామాన్య ప్రజలకు కాదు. మద్యం స్కాంలో చెవిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు… జగన్ ఇంటి తలుపులు కొట్టడం కూడా కాయం అంటూ ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.