అధికార పక్షానికి అడ్డు తగులుతోన్న శాసనమండలిని రద్దు చేసి జగన్ సర్కార్ కేంద్రానికి సిఫార్స్ చేసిన సంగతి తెలిసిందే. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల బలం ఎక్కువ ఉండటం తో శాసనసభలో ఆమెదం పొందిన బిల్లులకు అడ్డుతగలడంతో పెద్దల సభకి బైబై చెప్పాలనే నిర్ణయించింది. అయితే ఒకవేళ రద్దు కాకుండా ఉంటే వచ్చే ఏడాది..రెండేళ్లలో వైకాపా బలం మండలిలో పెరిగే అవకాశం ఉండటంతో జగన్ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రచారంలోకి వచ్చింది. రద్దు చేస్తే వచ్చే నష్టం టీడీపీ కన్నా వైకాపాకే ఎక్కువగా ఉంటుందని భావించి రద్దు నిర్ణయంపై జగన్ మంత్రివర్గం పునరాలోచనలో పడినట్లు లీకైంది.
అయితే అసలు విషయం అది కాదని ఎట్టి పరిస్థితుల్లో మండలి రద్దుకే జగన్ కట్టుబడి ఉన్నారని తాజాగా ఆ పార్టీ నేతల నుంచి లీకైంది. రద్దు దిశగానే జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. సీఎం ఒకసారి తీసుకున్న నిర్ణయంపై మళ్లీ పునరాలోచించే ప్రశక్తే లేదంటున్నారు. ఎవరిది వారికి తిరిగి ఇవ్వాల్సిందేనన్న వైఖరితో వైకాపా అదిష్టానం ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మండలిని రద్దు చేసి టీడీపీ ఎమ్మెల్సీలను బయటకు పంపిస్తే! పరిపాలన పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తు న్నారుట. మండలి ఉన్నంత కాలం ప్రభుత్వానికి టీడీపీ నుంచి తలబొబ్బికట్టే విధంగానే ఉంటుందని…అలాంటప్పుడు గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం దేనికని అంటున్నారు.
ఈ ప్రపోజల్ కారణంగా మండిలిలో ఉన్న టీడీపీ నేతలు వైకాపా లో స్వచ్ఛందంగా చేరే అవకాశం లేకపోలేదని మాట్లాడుకుంటు న్నారు. ఆ విధంగా పార్టీ బ్యాకెండ్ పనిచేస్తుందని సమాచారం. ప్రస్తుతం టీడీపీ ఏపీలో ఉనికిని సైతం కోల్పోయే పరిస్థుల్లో ఉంది. ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఐదారుగురు వైకాపా కండువా కప్పుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అటు టీడీపీ సీనియర్ నేతలంతా అక్రమ కేసుల్లో జైళ్లకెళ్తున్నారు. అక్కడ శాసన మండలి రద్దు..ఇటు ఎమెల్యేల జంపింగ్ జరిగితే ప్రతిపక్షమే లేకుండా పోతుంది. ఈ దెబ్బ తో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అండ్ కో సహా పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశం కూడా ఉండదని భావిస్తున్నారుట.