అమరావతిలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు మూవీని తలపిస్తున్నాయి. ఏపీ ప్రజలు కరోనా వ్యాక్సిన్ కంటే కూడా అమరావతిపై వచ్చే ఫైనల్ తీర్పు కోసం ప్రజలు వేచి చూస్తున్నారు . మూడు రాజధానుల నిర్మాణం కోసం వైసీపీ ప్రభుత్వం గవర్నర్ ముద్ర వేయించుకున్న నేపథ్యంలో ప్రజా వ్యాజ్యాలు హై కోర్టులో దాఖలు కావడంతో ఈ బిల్లుపై హై కోర్టు స్టేటస్ కో విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే పిటిషన్ లో చేసిన తప్పుల వల్ల కేసు ఇంకా విచారణకు రాలేదు.
అయితే ఈనెల 16న శంకుస్థాపనకు వైసీపీ నాయకులు ముహూర్తం పెట్టారు. ఈ శంకుస్థాపనకు ప్రధాని మోడీని కూడా ఆహ్వానించాలని చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల ఈ ముహూర్తానికి శంకుస్థాపన చేయడం అసాధ్యమని భావించిన వైసీపీ నాయకులు కొత్త ముహూర్తానికి తెర లేపారని తెలుస్తుంది. ఈ నూతన ముహూర్తానికి విజయదశమిని ఎంచుకున్నారని సమాచారం. ఈ విషయన్నీ ప్రధాని మోడీకి కూడా తెలియజేశారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
శాసన ప్రక్రియ సరిగ్గా జరగకుండా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటలని, జ్యుడీషియల్ క్యాపిటలని రాష్ట్రంలో గందరగోళం సృష్టించడమేంటని ప్రతిపక్షాల నాయకులు ప్రశ్నించడంతో …విపక్షాలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నాయని, ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయమని, అధికార పార్టీ చెబుతోంది. ఈ రాజధాని గొడవల్లో నాయకులు బాగానే తమ రాజకీయ వ్యూహాలను అమలు చేసుకుంటున్నారు కానీ ఈ పోరులో రైతులు బాలి అవుతున్నారని, వారి గురించి నాయకులు ఆలోచించడం లేదని సామాన్య ప్రజలు రాజకీయ నాయకులను ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానుల ప్లాన్ విషయంలో జగన్ ప్రస్థుతానికి ప్లాప్ అవుతున్నప్పటికి, రానున్న కాలంలో ఆ ప్లాన్ ను సూపర్ హిట్ అమలు చేయనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.