రాజకీయాలలో ఏ పార్టీ డప్పు ఆ పార్టీ కొట్టుకుంటుంది. డప్పు వేయకపోతే ఎలా? ఆ పార్టీ గురించి తెలిసేదెలా? అదీ కొత్తగా పురుడు పోసుకునే పార్టీల్లో ఆ డప్పు ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే అది స్థాయిని బట్టి ఉండాలి. స్థాయిని మించితే కామెడీ అయిపోతుంది. ఆ కామెడీ కూడా దాటిపోతే `ఫసక్` అయిపోతుంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీ అలాంటి కామెడీని మించే `ఫసక్` అనే పతాక స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ ఏపీలో టీడీపీ గురించి ఆ పార్టీలో శూన్యత ఏర్పడింది అనడమే పెద్ద కామెడీ. ఒకవేళ అందులో సీరియస్ నెస్ ఉన్నా సాధ్యాసాధ్యాలు ఏంటి? అన్నది కూడా నిరూపించి మాట్లాడాలి. ఆ విషయాలు కాసేపు పక్కనబెట్టి అసలు ట్రాక్ లోకి వస్తే…
చంద్రబాబుని- మోడీ బుక్ చేయడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేసారుట. ఆ ప్లాన్ ఏంటంటే? వైకాపా టీడీపీ వాళ్లని నేరుగా తమ పార్టీలోకి చేర్చుకోకపోవడమేనంట. ఎలాగంటారా? జగన్ ఎన్నికలకు ముందే తమ పార్టీలోకి రావాలంటే పార్టీ, పదవికి రాజీనామా చేసి రావాలని ఓ మాట అన్నారు గుర్తుందిగా. అయితే ఈ మాట వెనుక మతలబు ఉందిట. ఆ మతలబు ఏంటంటే? ఏపీలో టీడీపీ వారిని, ఇంకా ఎవరు ? ఆసక్తిగా ఉంటే వారిని వైకాపా కావాలనే తమ పార్టీలో చేర్చుకోకపోవడమంట. దానికి వెనక ఉన్న సంగతేంటంటే? బీజేపీ కోసం వైకాపా కావాలనే ఆ నేతల్ని..ఆ ఓటు శాతాన్ని వాళ్ల కోసం వదిలేసినట్లు చెబుతున్నారు. ఇది జగన్ గేమ్ అంట. జగన్ ఇలా చేస్తే చంద్రబాబు బీజేపీ దృష్టిలో మరింతగా బ్యాడ్ అవ్వడమంట.
ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి జగన్ తీసుకెళ్లి చంద్రబాబుని అక్కడ లాక్ చేయడం అన్నట్లు. అయినా ఏపీలో బీజేపీ జనసేనతో కలిసి ప్రయాణం సాగిస్తోంది. బీజేపీ మీటింగ్ పెడితే జనాలు రారు..కానీ బీజేపీ-జనసేన కలిసి పెడితే లక్షల్లో పవన్ అభిమానులు తరలి వస్తారు. అది చాలదా…జగన్ గుండెల్లో టెర్రర్ సీన్ మెరవడానికి. కాబట్టి జగన్ ఇలాంటి త్యాగాలు చేసే ఛాన్స్ లేదు. రాజకీయంగా ఎన్ని గేమ్ లు నడిచినా చివరిగా క్యాడర్ స్థాయి నాయకుడి మైండ్లో ఉండే కాన్సెప్ట్ ఒక్కటే. అదే అశ్వమేధ యాగం. చంద్రబాబు నాయుడైనా, పవన్ కళ్యాణ్ అయినా, జగన్ మోహన్ రెడ్డి అయినా, సోము వీర్రాజు అయినా వీలైనంత ఓటు బ్యాంక్ కూడగట్టడం కోసమే నిరంతరం పనిచేస్తారన్నది మర్చిపోతే ఎలా.