ఎన్నికల్లో టిఆర్ఎస్ పోటీ చేయట్లేదా ?

Is TRS not contesting in MLC elections 

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి.  రాష్ట్రంలో అత్యంత కీలకమైన హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ పట్టభద్రుల  నియోజకవర్గ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఇందుకు కారణం పోటీలోకి ఒక ప్రముఖుడు దిగడమే.  ప్రజెంట్ ఈ స్థానం నుండి బీజేపీ నేత రామచంద్రరావు  ఎమ్మెల్సీగా ఉన్నారు.  ఆయన పదవీకాలం 2021 మార్చితో ముగియనుంది.   ఎలాగైనా ఈ కీలకమైన స్థానంలో మళ్ళీ పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది.  బీజేపీ హైకమాండ్ సైతం ఈ స్థానంలో గెలుపు విషయమై పట్టుదలగా ఉండగా కాంగ్రెస్ సైతం పోటీలో నిలిచింది.  

Is TRS not contesting in MLC elections 
Is TRS not contesting in MLC elections

అయితే గతంలోనే ఈ స్థానాన్ని దక్కించుకోలేకపోయినందుకు తెరాస తీవ్ర నిరాశకు లోనైంది.  హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉండే ఎమ్మెల్సీ స్థానం కావడంతో ఆ స్థానాన్ని కోల్పోవడం నచ్చలేదు వారికి.  అందుఎక్ ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని పట్టుబట్టుకుని కూర్చున్నారు.  తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడే సమయంలో సైలెంట్ అయిపోయారు.  కొన్నిరోజుల క్రితం వరకు వరకు   నమోదు ప్రక్రియను కూడ హుషారుగా చేసిన నేతలు ఇప్పుడు కనిపించట్లేదు.  మరి దీనికి కారణం ఏమిటయా అంటే మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్  స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడేమే అనే మాట వినిపిస్తోంది. 

ఈయనకు పొలిటికల్ పార్టీల అండ లేకపోవచ్చు కానీ సొంత ఇమేజ్ చాలా ఉంది.  గతంలో ఇదే స్థానం నుండి  రెండుసార్లు విజయం సాధించిన ఆయన 2014 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు.  ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టి రైతుల సమస్యలలో పాటు పలు సమస్యల మీద గట్టిగా నిలదీస్తున్నారు పాలకవర్గాన్ని.  ఆయనకు లెఫ్ట్ పార్టీలు మద్దతిస్తున్నాయి.  మొదట ఆయన్ను తెరాస నుండే బరిలోకి దిగమని ఆఫర్ ఇచ్చారని, కానీ ఆయన ఒప్పుకోలేదని  చెప్పుకుంటున్నారు.  ఆయన మీద పోటీ పెట్టడం కంటే ఆయనకు మద్దతిస్తే బాగుంటుందనే ఆలోచనలో తెరాస ఉండొచ్చని చర్చలు నడుస్తున్నాయి.