జ‌గ‌న్ స‌ర్కార్ లెక్క కూడా గాడి త‌ప్పుతోందా?

తెలుగు రాష్ర్టాల్లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. గ‌త నెల రోజులుగా భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ప‌రీక్ష‌లు ఎన్ని ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయో! అంత‌కంత‌కు కేసుల సంఖ్య పెరుగుతోంది. మ‌ర‌ణాల సంఖ్య అలాగే ఉంది. తాజాగాఏపీలో కొత్తగా 4944 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 58,668కి చేరింది. ఇందులో 32,336 కేసులు యాక్టివ్ గా ఉంటె, 25,574 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 62 మరణాలు సంభవించాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ న‌మోదైన మొత్తం మరణాల సంఖ్య758కి చేరింది.

ఇది అధికారికంగా ప్ర‌భుత్వం చెప్పిన లెక్క‌. మ‌రి ఈ లెక్క నిజ‌మేనా? 13 జిల్లాల్లోనూ కేసులు అంతే న‌మోద‌వుతున్నాయా? మ‌ర‌ణాల సంఖ్య అలాగే ఉంటుందా? ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వైద్యం ఎలా అందుతుంది? అంటే జ‌గ‌న్ స‌ర్కార్ పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. రోజూ న‌మోద‌వుతోన్న కేసుల‌కు…ప్ర‌భుత్వం చెప్పే లెక్క‌ల‌కు చాలా తేడా ఉంద‌నే? అనుమానం వ్య‌క్తం అవుతుంది. రోజుకి ఐదు వేల‌కుపైగానే కేసులు న‌మోదవుతున్నాయ‌ని, కానీ అస‌లు లెక్క దాచి పెట్టి రెండు వేలు, మూడు వేలు అంటూ త‌ప్పుడు లెక్క‌లు చెబుతుంద‌ని ఆరోప‌ణ‌లొస్తున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా భారీగానే న‌మోద‌వు తుందంటున్నారు.

విశాఖ ప్ర‌భుత్వ ఆసుప‌త్రి కేజీహెచ్, శ్రీకాకుళం జెమ్స్ ఆసుప‌త్రి స‌హా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో కేసులు ఎక్కువే న‌మోదైన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం వాటిని కుదించి మీడియాకు వెల్ల‌డిస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అలాగే ప్ర‌భుత్వం అందిస్తోన్న వైర‌స్ కి సంబంధించి మందుల‌ను, పీపీఈ కిట్ల‌ను ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌కు అమ్ముకుంటున్న‌ట్లు ఆరోప‌ణ లొస్తున్నాయి. ఆసుప‌త్రుల్లో చికిత్స విధానంలో కూడా డాక్ట‌ర్లు అల‌స‌త్వం తో వ్య‌వ‌రిస్తున్నార‌ని, మ‌ర‌ణాల‌కు డాక్ట‌ర్ల ప‌నితీరు కూడా ఓ కార‌ణంగా బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. మ‌రి వీటిపై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుంది అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే ఈ విష‌యంలో తెలంగాణ స‌ర్కార్ అడ్డంగా దొరికిపోయిన సంగ‌తి తెలిసిందే. దీంతో హైకోర్టుతో మొట్టి కాయ‌లు త‌ప్ప‌లేదు.