గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టి షాక్ ఇవ్వబోతున్నారా? తెర వెనుక వంశీని తుంగలోకి తొక్కేసే ప్రయత్నాలు మొదలయ్యాయా? వంశీని కోలుకేలోని దెబ్బ కొట్టేలా చంద్రబాబు పావులు కదుపుతు న్నారా? అంటే అవుననే తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు పేరెత్తితే వల్లభనేని వంశీ ఒంటి కాలుపై లేచిపడతాడు అన్నది తెలిసిందే. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత ఎందుకనో ఆ పార్టీతో వంశీకి పొసగలేదు. దీంతో పార్టీకీ..పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీపై విమర్శలు గుప్పించి వైసీపీ మద్దుతుదారడిగా చేరిపోయారు.
మంత్రి కొడాలి నాని, పేర్ని నానిల నుంచి మంచి సహకారం ఉండటంతో వంశీ గనుక వైసీపీలో చేరితో పెద్ద పీట వేసే అవకాశం ఉందని తొలి నుంచి వినిపిస్తున్నదే. అయితే ఇప్పుడు చంద్రబాబు ముందున్న టార్గెట్ వంశీ ఎదుగుదలను ఆపడం. ఈ నేపథ్యంలో చంద్రబాబు గన్నవరం లో ఆ రకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వంశీ వైసీపీ మద్దతుదారుడిగా మారిపోయిన తర్వాత గన్నవరం ఇంచార్జ్ పోస్ట్ ఖాళీగానే ఉంది. ఇప్పటివరకూ ఆ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. ఈ నేపథ్యంలో కార్యకర్తల నుంచి ఇలాగే వదిలేస్తే పరిస్థితి చేయి దాటి పోతుందన్న ఫీడ్ బ్యాక్ క్యాడర్ కి చేరిందిట.
దీంతో చంద్రబాబు వెంటనే అక్కడ ఇంచార్జ్ ని నియమించాలని సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్ధికంగా బలమైన నాయకుడ్నే అక్కడ పెట్టాలని భావిస్తున్నారుట. ఈ నేపథ్యంలో ఓ ఎన్ ఆర్ ఐ పేరు తెరపైకి వస్తోంది. అమెరికా తానా సభల్లో సభ్యుడైన ఒకరితో ఇప్పుడా పోస్ట్ భర్తీ చేపడుతున్నారుట. అయితే అతను తాత్కాలికమనే అంటున్నారు. ఎన్ ఆర్ ఐ అంటే పొలిటికల్ గా బలమైన వ్యక్తేం కాదు. ప్రస్తుతానికి కార్యకర్తిల్ని మచ్చిక చేసుకుంటే చాలు. రాష్ర్టంలో కరోనా పరిస్థితులు అన్ని చక్కబడిన తర్వాత ఒకవేళ ఉప ఎన్నిక గనుక వస్తే! అప్పుడు సీనియర్ ని రంగంలోకి దించి వంశీకి చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకోవాలని అదిష్టానం భావిస్తోందిట.