Health Tips: సాధారణంగా మహిళల్లో తరచూ వేధిస్తున్న సమస్యలు నెలసరి సమస్యలు ముఖ్యమైనవి. ప్రతి నెల నెలసరి సమయంలో మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. కొంతమంది మహిళల్లో రుతుక్రమం సక్రమంగా రాకపోవటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరంలో హార్మోన్ల ప్రభావం, అధిక బరువు వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించి చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొంచెం పసుపు , దాల్చినచెక్క పొడి వేసి కలుపుకొని తాగాలి. ప్రతిరోజు కొన్ని నెలల పాటు ఇలా చేయడం వల్ల మహిళల్లో రుతుక్రమం సక్రమంగా వస్తుంది. అంతే కాకుండా పసుపు దాల్చిన చెక్క లోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరకుండా ఉంటాయి.
కలబంద వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలోని ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చర్మ, జుట్టు సంరక్షణకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జు తినడం వల్ల కొన్ని రోజుల తర్వాత నెలసరి సక్రమంగా వస్తుంది.
బొప్పాయి పండు లోని ఎన్నో రకాల ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. నెలసరి సక్రమంగా రాణి మహిళలు ప్రతిరోజు దోరగా ఉన్న బొప్పాయి పండును తినటం వల్ల నెలనెలా రుతుక్రమం సక్రమంగా వస్తుంది.