సి‌బి‌ఐ ని దించడమే బండి , మోడీ ల ప్లాన్ ? కే‌సి‌ఆర్ ని అరస్ట్ చేయించడం కోసమే ?

Bandi Sanjay

 తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు మాములుగా లేదు. సీఎం కేసీఆర్ ను ఇరుగున పెట్టటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు, అతని దూకుడు చూసి తెరాస సర్కార్ కూడా మౌనంగా ఉంటుంది తప్పితే, బండిని టార్గెట్ చేయటానికి భయపడుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ ను ఎవరు ఇబ్బంది పెట్టని విధంగా సంజయ్ ఇబ్బందులు పెడుతున్న కానీ తెరాస నేతలెవరూ డైరెక్ట్ గా బండిపై విమర్శలు కూడా చేయటం లేదు. మరోపక్క రాష్ట్ర పోలీస్ శాఖను కూడా టార్గెట్ చేసుకొని బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్న ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనమే మేలు అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

Bandi Sanjay

 ఇదే అదునుగా భావిస్తున్న బండి సంజయ్ తెరాస పార్టీలోని ముగ్గురు కీలక నేతలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఆ ముగ్గురు నేతలు సీఎం కేసీఆర్ కు అత్యంత దగ్గరి వ్యక్తులని తెలుస్తుంది. ఆ నేతలు అక్రమ మార్గాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని, దానిపై విచారణ చేయటానికి సిబిఐ రంగంలోకి దిగాలని కోరుతూ బండి సంజయ్ ఒక లేఖను కేంద్ర ప్రభుత్వానికి అందచేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో దీని గురించి చర్చించినట్లు తెలుస్తుంది.

 అయితే ఈ విషయంలో ఇప్పుడే తొందర పడటం మంచిది కాదని, కొన్ని రోజులు వేచి చూడమని కిషన్ రెడ్డి చెప్పటంతో బండి సంజయ్ ఒక అడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తుంది. అయితే సంజయ్ కు వచ్చిన ఆ ఆలోచన ఇప్పుడు తెరాస నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కునే విషయంలో కేసీఆర్ వెనకపడ్డాడు, ఇక తెరాస పని అయిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీలోని కీలక నేతలపై సిబిఐకి లేఖ రాయబోతున్నారు అనే టాపిక్ తీవ్ర కల్లోలాన్ని సృష్టిస్తుంది. మరి దీనికి కేసీఆర్ ఎలా ఎదుర్కుంటాడో చూడాలి