Health Tips: ఆస్తమా సమస్య వేదిస్తోందా? ఈ ఆహార పదార్థాల వల్ల సమస్య నియంత్రించవచ్చు..!

Health Tips: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్యలలో ఆస్తమా సమస్య కూడా ఒకటి.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24.5 కోట్లకు పైగా ఆస్తమాతో బాధపడుతున్నారని,వారిలో ఒక్క ఇండియాలోనే 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. మన దేశంలో ముఖ్యంగా చిన్న పిల్లలో దాదాపు 100 కి 15 మంది పిల్లలు ఆస్తమా సమస్య త్ ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్య తీవ్రత తక్కువ ఉండటం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు.కానీ.. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కచ్చితంగా డాక్టర్ నీ సంప్రదించాలి. ఊపిరితిత్తులలో కండరాలు వ్యాకోచించడం వల్ల వాయు నాళాలు సన్నబడతాయి. అందువల్ల గాలి పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా ఉంటుంది.ఆస్తమా సమస్య ఉన్నవారు కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసపడుతూ ఉంటారు. వాతావరణ కాలుష్యం,చల్లని గాలి, సుగంధ పరిమళాలు, వ్యాయామం, మానసిక ఆందోళన వంటి వాటి వల్ల ఆస్తమా సమస్య అధికమవుతోంది. కొన్ని ఆహారపు అలవాట్లు వల్ల ఆస్తమా సమస్యను నియంత్రించవచ్చు.

సాధారణంగా ప్రతి వంటింట్లో ఉల్లిపాయ విరివిగా లభిస్తుంది. ఉల్లిపాయలు ఎన్నో రకాల పోషక విలువలు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి అనేక అనారోగ్య సమస్యలను దరి చేరకుండా చేస్తుంది. ఉల్లిపాయల్లో యాంటీ – ఇన్‌ప్లమేటరీ , యాంటీ అస్త్మాటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల హిస్తమిన్‌ విడుదలను  అడ్డుకొని బ్రోంకియల్ అబ్‌స్ట్రక్షన్ తగ్గిస్తుంది.

విటమిన్ సి పుష్కలంగా ఉన్న నారింజ పండు పుల్లటి ద్రాక్ష, నిమ్మ పండు రసం వంటి వాటిని తీసుకోవడం వల్ల ఆస్తమా సమస్య నియంత్రణలో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. రెడ్ క్యాప్సికం లో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇన్‌ప్లమేషన్‌ తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.