జగన్ అలర్ట్ అవ్వాల్సిన న్యూస్ : అక్కడ వైకాపా రెండు చీలుతుందా?

Central government spoils YS Jagan's english medium plans

మూడు రాజధానుల నిర్మాణానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కొంతమందికి ఆనందం కలిగిస్తుంటే మరికొంత మందికి బాధను కలిగిస్తుంది. అయితే ఈ రాజధానికి నిర్మాణం వల్ల వైసీపీకి ఈ ప్రాంతంలో ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చెయ్యడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అక్కడి వైసీపీ నేతలు మాత్రం ఆ ప్రాంతంలో పెత్తనం కోసం కొట్లాడుకుంటున్నారు. దీనిపై సిఎం జగన్ కు ఇప్పటికే ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. రాజకీయంగా బలంగా ఉండటంతో వైసీపీ నేతల వాదనకు అంత ప్రాధాన్యత సొంత పార్టీలోనే రాలేదు.

తమ నేతలకు బాగా సన్నిహితులకు చెందిన భూములను ఒక నేత బలవంతంగా కొనే ప్రయత్నం చేసారని, అలాగే వైసీపీకి ఓటు వేసిన ప్రజల నుండి భూములను కొనే ప్రయత్నం చేస్తున్నారని ఆప్రాంతనికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట వినకపోతే బెదిరింపులకు దిగడం చూసి ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక విశాఖకు చెందిన ఒక మంత్రి గారి వద్దకు వెళ్లారట సదరు వైసీపీ నేతలు. ఈ విషయంపై స్పందించిన మంత్రి…ఈ విషయంపై ఒక నివేదిక తయారు చేయాలని పార్టీ ప్రముఖులకు ఆదేశాలు కూడా జారీ చేశారట. అయితే ఆ నేతపై వైసీపీ అధిష్టానం ఇంకా చర్యలు తీసుకోకపోవడం పట్ల వైసీపీకి చెందిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెత్తనం గొడవల వల్ల విశాఖలో వైకాపా రానున్న రోజుల్లో రెండుగా విడిపోయే అవకాశం ఉందని రాజకీయ పండితులు చెప్తున్నారు. మూడు రాజధానుల బిల్లు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడే వైసీపీ నేతలు ఇలా ఆధిపత్యం కోసం గోడవపడుతుంటే, ఒక్కసారి బిల్లు అమలు అయితే వైకాపా నేతల అరాచకాలకు హద్దు ఉండదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.