మనలో చాలామంది ఏదో ఒక సందర్భంలో సత్యనారాయణ వ్రతం గురించి వినే ఉంటారు. సాధారణంగా కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం జరుపుకోవడం జరుగుతుంది. ఈ వ్రతం జరుపుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల కొత్తగా ఇంటికి వచ్చిన కోడలు అందరితో కలిసిపోవడంతో పాటు వ్రతం సమయంలో అత్తామామలు కోడలు గురించి తెలియని వాళ్లకు సైతం తెలియజేసే అవకాశం అయితే ఉంటుంది.
వ్రతం చేసే సమయంలో బంధువులకు, ఊరిలోని ఆడవాళ్లకు ఆహ్వానం అందుతుంది. ఈ విధంగా చేయడం వల్ల కొత్త కోడలికి ఊరిలోని వాళ్లు కూడా సులభంగా పరిచయం అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కొత్తగా పెళ్లైన దంపతులు తమ జీవిత ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతో కూడా ఈ వ్రతాన్ని చేయడం జరుగుతుంది. సత్యనారాయణ స్వామి అసాధారణమైన శక్తిని కలిగి ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు.
సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల ఏకరూపం అని చాలామంది అభిప్రాయపడతారు. సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల నష్టాలు, బాధలు తొలగిపోయే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎంతో విశిష్టత ఉన్న ఈ వ్రతం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కార్తీకమాసంలో దీపం వెలిగించే సమయంలో ఒక వత్తిని వెలిగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. కార్తీకమాసంలో భక్తితో దీపారాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. ఎవరైతే భక్తితో దీపారాధన చేస్తారో వాళ్లకు మంచి ఫలితాలు కచ్చితంగా కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సమీపంలోని పండితులను సంప్రదించి సత్యనారాయణ వ్రతం గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు.