ప్రతి ఒక్కరి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలలో పెళ్లి ఒకటనే సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకునే వాళ్లకు పెళ్లైన తర్వాత పండితులు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అయితే అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు. అయితే పెళ్లిలో ఈ విధంగా అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలంటే అరుంధతి నక్షత్రం గురించి అవగాహనను ఏర్పరచుకోవాలి.
పవిత్రతకు పర్యాయపదం అరుంధతి కాగా అరుంధతికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. భర్తను తప్ప మరో పురుషుడిని కన్నెత్తి కూడా చూడని మహా పతివ్రత అరుంధతి. ఆమె వశిష్ట మహర్షిని వివాహం చేసుకుంది. అగ్ని దేవుడు రుషుల భార్యలపై మోజు పడగా ఈ విషయంను అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి గ్రహిస్తుంది. రోజుకొక రుషి భార్య అవతారంలో ఆమె భర్త కోరికను తీరుస్తూ ఉంటుంది.
అయితే స్వాహాదేవి ఎంత ప్రయత్నించినా ఆమె అరుంధతి రూపంలోకి మారడం సాధ్యం కాదు. అరుంధతి పెద్ద పతివ్రత కావడం వల్లే ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత కాలంలో అరుంధతి నక్షత్రంగా మారడంతో పాటు ప్రపంచానికి ఆదర్శంగా నిలవడం గమనార్హం. అరుంధతికి శక్తి అనే కొడుకు ఉండగా ఆ శక్తి కొడుకు పేరు పరాశరుడు కావడం గమనార్హం. ఆ పరాశరుడి కొడుకు పేరు వ్యాసుడు కావడం గమనార్హం.
ఈ విధంగా అరుంధతి నక్షత్రానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అరుంధతి ఇసుకను వండి అన్నంగా మార్చడం వల్ల ఆమెను వశిష్టుడు వివాహం చేసుకున్నారు. అరుంధతి భర్తకు ఇచ్చిన మాట కోసం సంవత్సరాల పాటు భర్త కమండలంను చూస్తూ ఉండటం గమనార్హం. అరుంధతి గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని పండితులు చెబుతున్నారు. అంత గొప్ప చరిత్ర ఉండబట్టే పెళ్లైన వాళ్లకు అరుంధతి నక్షత్రంను చూపించడం జరుగుతుంది.