ఇండస్ట్రీ అప్డేట్ : “RC 15” లో అంజలి రోల్ పై టోటల్ డీటెయిల్స్.!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న పలు చిత్రళ్ళూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కూడా ఒకటి. పాన్ ఇండియన్ టాప్ దర్శకుల్లో ఒకరైనటువంటి డైరెక్టర్ శంకర్ తో తన మార్క్ లో ఈ సినిమాని ఒక భారీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యి చాలా వరకు షూటింగ్ అయితే పూర్తయ్యి పోయింది. అయితే ఈ చిత్రంలో శంకర్ దాదాపు మన తెలుగు క్యాస్టింగ్ నే తీసుకోగా కంప్లీట్ తెలుగు సినిమా లానే తాను చేస్తున్నారు. మరి సినిమా కాస్ట్ ని అనౌన్స్ చేసిన సమయంలోనే ప్రముఖ హీరోయిన్ అంజలి ని కూడా అందులో చూపించారు.

మరి అంజలికి ఏదో సింపుల్ రోల్ చేస్తుందని అంతా అనుకున్నారు కానీ శంకర్ మాత్రం ఆమెకి షాకింగ్ రోల్ ఇచ్చారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు బయటకి వచ్చేసాయి. ఈ చిత్రంలో అంజలి రామ్ చరణ్ కి భార్యగా నటిస్తుందట.

అంతే కాకుండా ఈమీ పాత్ర రామ్ చరణ్ పై ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కనిపిస్తుందట. మరి దీనిపై అయితే కొన్ని ఫోటోలు కూడా బయటకి రావడం విశేషం. దీనితో అయితే ఈమె పాత్రపై సినిమాలో సరైన క్లారిటీ వచ్చేసింది.