మిథాలీ సేనకు మరో ఓటమి.. ఇంగ్లాండ్‌కు తొలి విజయం..

England women

న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచులో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతో భారత బ్యాటర్లను కట్టడి చేసిన ఇంగ్లాండ్ బౌలర్లు 36 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత జట్టులో ఓపెనర్ స్మృతి మంధాన (58 బంతుల్లో 35) మాత్రమే టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 31.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.