Immunity Power: పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచాలా..? ఇలా ట్రై చేయండి..!!

Immunity Power: ఆరోగ్యంగా ఉండాలంటే మనకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. ప్రస్తుత కరోనా సమయంలో అందరూ ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెడుతున్నారు. ఎన్నో ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు. పెద్దలకే కాదు.. ఇప్పుడు చిన్నారుల్లో కూడా రోగనిరోధక శక్తి అవసరం. పెద్దవారే వారికి కావాల్సినవన్నీ సమకూర్చాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇవ్వాలి. వైరస్, సూక్ష్మజీవులు, ఆరోగ్యం, శ్రద్ధపై పెద్దగా వారికి అవగాహన ఉండదు. ఫలితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.

గుడ్లు సంపూర్ణ పోషకాలుంటాయి. చిన్నపిల్లలకు ఇవి చాలా బలాన్ని ఇస్తాయి. గుడ్డులో విటమిన్-డి, జింక్. సెలినీయం, విటమిన్-ఈ వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మంచి ప్రోటీన్లను అందిస్తుంది. వారి ఆరోగ్యాన్ని పెంచుతుంది. సాల్మన్ చేపలో ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

బాదంపప్పులో విటమిన్-ఈ, మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే కొన్ని బాదం గింజలను ఇస్తే మంచి ఆరోగ్యం, బలం వస్తుంది. పిల్లలకు వీటిని అలవాటు చేయాలి. అధికబరువు తగ్గడంలో బాదం సాయపడుతుంది. పెరుగును పిల్లలకు ఖచ్చితంగా అలవాటు చేయాలి. కొందరు పెద్దలు పెరుగు తినరు. దీంతో పిల్లలకు కూడా అలవాటు చేయరు. కానీ.. పిల్లలకు సులభంగా జీర్ణమయ్యే ఆహారం. పెరుగు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడి తగ్గిస్తుంది. పెరుగులో పంచదార పిల్లలకు అలవాటు చేయొద్దు.

బ్రకోలీ.. పిల్లలకు, పెద్దలకు కూడా మంచి ఆహారం. పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఓట్ మీల్.. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చిన్న పిల్లలకు త్వరగా జీర్ణం అవుతుంది. రోగకారక క్రిములను నిరోధిస్తుంది. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. బెర్రీలు.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. హానికరమైన సూక్ష్మజీవుల నుంచి రక్షణ ఇస్తాయి. సులభంగా జీర్ణమవుతుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ, పిల్లల ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.