మీ దంతాలు పసుపు పచ్చగా ఉన్నాయా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

మనిషి చిరునవ్వును వ్యక్తపరిచేది దంతాలు. ప్రతి మనిషిలో అవతలి మనిషికి కనిపించేవి వారు నవ్వినప్పుడు వారి దంతాలు. అయితే దంత సంరక్షణ కోసం చాలా మంది చాలా రకాలుగానే పాట్లు పడుతుంటారు. దంతాలు పటిష్టంగా ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వాటి రంగు మారుతుంది. అందువల్ల నలుగురిలో హాయిగా నవ్వాలన్న మొహమాట పడాల్సి వస్తుంది. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

దంతాల సంరక్షణ కై ప్రతిరోజు మరికొంత మంది ఉదయం లేవగానే అలాగే రాత్రి పడుకునే ముందు రెండు సార్లు బ్రష్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఏమైనా తినగానే లేదా టీ కాఫీ లు తాగగానే మౌత్ వాష్ నీ వాడుతుంటారు. ఇలాంటి వారి దంతాలు తెల్లగా ఉంటాయి మరియు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇంకా కొంతమందిలో ఎన్ని సార్లు బ్రష్ చేసిన ఎంత కేర్ తీసుకున్నా దంతాలు మాత్రం పసుపు పచ్చ రంగులో మారుతాయి. ఈ సమస్యతో బాధపడే వారు కొబ్బరి నూనె ఒక టేబుల్ స్పూన్ మోతాదులో నోట్లో పోసుకొని ఆయిల్ పుల్లింగ్ అంటే పుక్కిలించాలి. ఇలా ఒక పది నిమిషాలు చేసిన తర్వాత ఆ నూనెను మూసి కొన్ని మంచి నీళ్లు నోట్లో పోసుకొని పుక్కిలించి తర్వాత బ్రష్ చేసుకోవాలి.

బేకింగ్ సోడాలో దంతాలను తెల్లగా మార్చే గుణం ఉంటుంది . దీనిని కొన్ని రకాల టూత్ పేస్ట్ లలో కూడా వాడతారు. బేకింగ్ సోడాను పేస్టులాగా చేసి రోజుకు రెండు పర్యాయాలు బ్రష్ చేస్తే మీ దంతాలు పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఒక్కటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కొన్ని నీళ్ళలో వేసి మిశ్రమం చేసి నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మి వేయాలి. బ్రష్ చేసే ముందు ఇలా చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది.

ఇవేకాక అరటి పండు తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం. అరటిపండు తొక్కను మీ పచ్చటి దంతాల మీద తిక్కితే మీ దంతాలు తెల్లగా నిగనిగలాడుతాయి. ఆపిల్ కొరికి దంతాలతో బాగా నమిలి తినడం వల్ల ఆపిల్ లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల పసుపు రంగులో ఉన్న దంతాలు తెలుపు రంగులోకి మారుతాయి.