Beauty Tips:ఏ వయసు వారికైనా బాహ్య ప్రపంచంలో అందంగా కనిపించాలని ఉంటుంది. వాటికోసం మార్కెట్లో కెమికల్స్ తో తయారు చేసిన ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ లను వినియోగిస్తు అందం రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ప్రకృతిలో సులభంగా లభించే కొన్ని ఆకుల ద్వారా కూడా ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇంటి పరిసర ప్రాంతాలలో విరివిగా లభించే వేపాకులతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం. నేచురల్ గా దొరికే వేపాకులతో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలి ఈ ఆర్టికల్ లో చదవండి.
మనదేశంలో ఆయుర్వేదానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. వేపలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. వేపని ఆయుర్వేదంలో వైద్యానికి ఉపయోగిస్తారు. వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీర ఆరోగ్యానికే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. వేప మానవ శరీరం మీద హానికరమైన యూవీ కిరణాల ప్రభావాన్ని నిరోధిస్తుంది. వేప, ముఖం మీద ఉన్న ముడతలు, మచ్చలు, మొటిమలను తగ్గించి అందంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
ఫేస్ ప్యాక్ 1: అర కప్పు తురిమిన దోసకాయ, ఏడు నుంచి ఎనిమిది వేపాకులను తీసుకొని వాటిని బాగా రుబ్బండి. ఈ మిశ్రమాన్ని మీరు ఫేస్ ప్యాక్ లా ముఖము, మేడ మీద అంటించండి. ఆరిన తర్వాత నీటితో బాగా కడగాలి. దోసకాయ చర్మాణానికి అవసరమైన ఆర్డ్రీకరణను అందిస్తుంది. ఈ ప్యాక్ మీ చర్మాన్ని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది.
ఫేస్ ప్యాక్ 2: ఆరు నుంచి ఏడు వేపాకులు, కొన్ని తులసి ఆకులు తీసుకొని వీటిని రుబ్బాలి. ఈ మిశ్రమానికి ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులోకి ఒక కప్పు ముల్తాన్ మట్టి వేసి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి వేసుకొని 15 నుండి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మం మీది జిడ్డుని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంతో పాటూ, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఫేస్ ప్యాక్ 3: ఒక అర కప్పు ఓట్స్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పాలు జోడించండి. దీనిలోకి వేప పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి మూడు నుంచి నాలుగు నిమిషాలపాటు సున్నితంగా రబ్ చేయాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. ఓట్స్ చర్మంలోని మృతకణాలను తొలగించడంలో సహాయ పడతాయి. పాలు, తేనె రెండు చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడంలో సహాయపడతాయి. మీ చర్మాన్ని అందంగా ఉంచడంలో ఈ ఫేస్ ప్యాక్ లు ఉపయోగపడతాయి.