మన దేశంలో చాలామంది అందంగా కనిపించాలని ఎన్నో చిట్కాలను పాటిస్తారు. ఆ చిట్కాల వల్ల కొన్నిసార్లు ప్రయోజనం చేకూరితే మరి కొన్నిసార్లు మాత్రం ఆశించిన ఫలితాలు రావు. అయితే అందంగా కనిపించడానికి మేకప్ మాత్రమే సరిపోదు. ముఖంలో సహజమైన మెరుపు లేకపోతే ఆకర్షణీయంగా కనిపించే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.
ఒక చెంచా గ్రామ్ పిండిలో కొద్దిగా పాలు మరియు కొద్దిగా చక్కెర కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖం, మెడపై అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి చేతులతో ఫేస్ ను కడిగితే చక్కెర స్క్రబ్ లా పని చేసి చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుందని చెప్పవచ్చు. అర కప్పు దానిమ్మ గింజలు, దోసకాయ రసం కలిపి ప్రత్యేక కంటైనర్లలో నిల్వ చేసి ఆ టోనర్ ను ప్రతిరోజూ ముఖానికి అప్లై చేస్తే మంచిది.
ఈ విధంగా చేయడం ద్వారా డల్ స్కిన్ రిఫ్రెష్ కావడంతో పాటు ఎక్కువ రోజులు ఉపయోగించే అవకాశాలు అయితే ఉంటాయి. బొప్పాయి ముక్కలను మిక్సీలో రుబ్బుకుని ముఖం, మెడపై ఆ పేస్ట్ ను రాసి శుభ్రం చేసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ముఖానికి మెరుపు వస్తుంది. రెండు చెంచాల ముడి పాలను ముఖం, మెడపై అలాగే ఉంచేస్తే చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.
అరటిపండును మెత్తగా చేసి ముఖానికి అప్లై చేసినా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కొబ్బరి, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. బెల్లం ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం ద్వారా జిడ్డు చర్మం నుండి ఉపశమనం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.