Beauty Tips: అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి ఒకప్పుడు అమ్మాయిలు మాత్రమే అందంపై శ్రద్ధ చూపేవారు కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారి అందాన్ని పెంపొందించుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇలా అందాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం మనం ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కూడా ఉపయోగిస్తూ ఉన్నాము కానీ సహజ సిద్ధంగా కూడా మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
మనం ప్రతిరోజు ఆహారం తయారు చేయడం కోసం బియ్యం కడుగుతాము ఇలా బియ్యం కడిగిన నీటిని మనం పడేస్తూ ఉంటాము కానీ ఈ నీటి ద్వారానే మనం మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. మనం బియ్యం కడిగిన నీటిలో విటమిన్ బి, సి, ఇ అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ నీరు జుట్టు సౌందర్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో ఎంతగానో దోహదం చేస్తాయి ఇలా బియ్యం కడిగిన నీటిని మన మొహానికి అంటించి పావుగంట పాటు అలాగే ఉంచాలి తర్వాత చల్లని నీటితో మొహం శుభ్రం చేయడం వల్ల మొహం పై ఉన్నటువంటి మచ్చలు క్రమంగా తగ్గిపోవడమే కాకుండా చర్మం ఎంతో మృదువుగా కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ బియ్యం కడిగిన నీటితో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల చుండ్రు దురద లాంటి సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి. సాయంత్రం బియ్యం కడిగిన నీటిని ఆ రోజు రాత్రి మొత్తం అలాగే ఉంచి మరుసటి రోజు జుట్టుకు రాసి అరగంట తర్వాత స్నానం చేయటం వల్ల జుట్టు చాలా షైనీగా ఉంటుంది. వారానికి ఒకసారి ఇలా చేయటం వల్ల జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి ఎంతగానో దోహదం చేస్తుంది.