సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంట్లో ఏడాది పాటు ఎలాంటి పూజలు చేయకూడదు ఎలాంటి ఆలయాలకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతుంటారు. అదేవిధంగా మరణం సంభవించిన ఆ ఇంటిలో శుభకార్యాలు కూడా చేయకూడదని చెబుతుంటారు.ఈ క్రమంలోనే ఏ ఇంట్లో అయితే మరణం సంభవించి ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి పూజా కార్యక్రమాలను నిర్వహించకుండా పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి చిత్రపటాలను కూడా భద్రంగా దాచిపెడతారు.నిజంగానే ఇంట్లో ఎవరైనా చనిపోతే పూజలు చేయకూడదా అసలు ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతుందనే విషయానికి వస్తే…
శాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారని చెబుతోంది. అందుకే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఆ ఇల్లు సకల సంపదలతో సుఖసంతోషాలతో ఉంటారని చెప్పాలి. ఇకపోతే ఒక ఇంట్లో మరణం సంభవించింది అంటే ఆ ఇంట్లో ఏడాది పాటు పూజలు చేయకూడదనే నియమం శాస్త్రంలో ఎక్కడా లేదు.కేవలం 11 రోజుల పాటు మాత్రమే ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకుండా ఉంటే చాలు 11 రోజుల తర్వాత ఇంటిని శుభ్రం చేసి యధావిధిగా పూజలు చేసుకోవచ్చని శాస్త్రం చెబుతోంది.
ఈ విధంగా 12వ రోజు నుంచి ఇంట్లో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేసుకోవడం ఆలయాలకు వెళ్లడం చేయవచ్చు. అయితే నూతన గృహాలు కొనుగోలు చేయడం, వాహనాలను కొనుగోలు చేయడం, శుభకార్యాలను మాత్రం ఏడాది పాటు చేయకూడదని శాస్త్రం చెబుతోంది.కానీ ప్రతిరోజు దీపారాధన చేసుకోవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి సంకోచం వ్యక్తం చేయాల్సిన పనిలేదని పండితులు తెలియజేస్తున్నారు.