తాజాగా జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా సమావేశంలో పాల్గొని రాజకీయ పరంగా చాలా విషయాలు పంచుకున్నారు. అయితే భాజపా, జనసేన పార్టీలకు ఉమ్మడి సీఎంగా మీరే పవన్ కళ్యాణ్ వుంటారు అని ప్రచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దాంతో పవన్ కళ్యాణ్ కి ఇలాంటి అవకాశం వస్తే ఏం చేస్తారు అని ప్రశ్న ఎదురయింది.
ఇక పవన్ స్పందిస్తూ.. తను గాల్లో మేడలు కట్టనని ఇదంతా ప్రచారం మాత్రమే అని అన్నారు. చంద్రబాబు మహానాడుకు ముందు జనసేనతో వన్ సైడ్ లవ్ అన్నారు. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు కదా దాని గురించి స్పందన ఏంటి అనటంతో.. సంతోషమే కదా అని పవన్ అన్నారు. నడ్డా రాజమహేంద్రవరం పర్యటనలో ఆయనను కలిసే అవకాశం లేదని చెప్పేశారు. అంతేకాకుండా సీఎం పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లడం ఖర్చుల దండగ అని అన్నారు.