హైపర్ ఆది అబద్ధం చెప్పాడా.?

Hyper Aadi Right Or Wrong | Telugu Rajyam

మంచు విష్ణుపై చేసిన కామెడీ స్కిట్ నేపథ్యంలో జబర్దస్థ్ ఆదిపై విష్ణు ఫ్యాన్స్ దాడి చేశారంటూ, గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ దాడిని ఖండిస్తూ, ఆది అలాంటిదేం లేదనీ, నా మీద ఎవ్వరూ ఎలాంటి దాడి చేయలేదని చెప్పడం జరిగింది.

కానీ, ఆదిపై దాడికి సంబంధించిన వార్తలు ఇంకా ఆగలేదు. ఆదిని కొట్టారంటూ నెట్టింట తెగ రచ్చ జరుగుతోంది. నన్ను కొట్టలేదు మొర్రో.. పబ్లిసిటీ కోసం.. డబ్బుల కోసం ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి కావాలంటే నేనే డబ్బులిస్తాను.. అంటూ ఆది ఓ ఓపెన్ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు.

ఇప్పటికే తాను ఓ పక్క జబర్దస్త్ షూటింగులోనూ, మరోపక్క సినిమా షూటింగుల్లోనూ బిజీగా ఉన్నానంటూ, అందుకు సంబంధించిన ఫోటోలను సైతం నెట్టింట పోస్ట్ చేశాడు ఆది. అయినా ఈ రచ్చ ఆగలేదు. ఈ రచ్చను ఆపాలంటే, ఆది ఇంకేం చేయాలో.. ఒకవేళ ఓపెన్‌ ప్రెస్ మీట్‌లు, డిబేట్లు లాంటివేమైనా పెట్టి ప్రూవ్ చేయాలో ఏమో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles