Kannappa OTT: కన్నప్ప ఈ ట్విస్ట్ ఏందప్పా… సైలెంట్ అయిన విష్ణు!

Kannappa OTT: మంచు విష్ణు హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా ఈ సినిమా సుమారు 200 కోట్లకు పైగా  బడ్జెట్ కేటాయించి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగానే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదలైన 69 రోజులకు ఓటీటీలో విడుదల కాబోతుందని ఇటీవల మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.

సాధారణంగా ఒక సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలాంటిది కన్నప్ప సినిమా మాత్రం ఏకంగా 69 రోజుల తర్వాత అనగా సెప్టెంబర్ 4వ తేదీ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతోంది అంటూ విష్ణు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇక నేడు ఈ సినిమా ఇప్పటివరకు ఓటీటీలో అందుబాటులోకి రాకపోయిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

కన్నప్ప కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానీ నేపథ్యంలో ఎందుకు సినిమా స్ట్రీమింగ్ అవ్వలేదు కొంపతీసి అమెజాన్ వారితో మూవీ డిల్ విఫలమైందా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సినిమా ఓటీటీలో ఎందుకు విడుదల కాలేదనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకు మంచు విష్ణు ఎక్కడ వెల్లడించలేదు.  ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ కూడా కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానులు ఎంతో ఆత్రుత చూపించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కారణంగానే సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని విష్ణు కూడా వెల్లడించారు.