Tammareddy: సీనియర్ నిర్మాత నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు అయితే తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సినిమా గురించి స్పందించారు. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కన్నప్ప అయితే ఈ సినిమా గతంలో విష్ణు సినిమాలతో పోలిస్తే చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. విష్ణు నటన కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇలా కన్నప్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అయినప్పటికీ తమ్మారెడ్డి భరద్వాజ్ మాత్రం ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. కన్నప్ప సినిమాని అద్భుతంగా ప్రేక్షకులకు చూపించారు కానీ ఈ సినిమాను ఇంతకంటే కూడా చాలా గొప్పగా తీయవచ్చని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకోవచ్చారు. అయితే ఈ సినిమాలో నాకు భక్తి కనిపించలేదని, డబ్బు కోసమే ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేశారని తన అభిప్రాయాన్ని తెలిపారు.
ఇకపోతే కన్నప్ప సినిమాలో శివుడు పార్వతిగా నటించిన అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటనను చూస్తుంటే నాకు చిరాకు వేస్తోందని అసలు శివుడు పార్వతికి వాళ్ళిద్దరూ ఏమాత్రం సెట్ కాలేదు అంటూ తమ్మారెడ్డి తెలియచేశారు. వారిద్దరి పాత్రలు తప్ప సినిమాలో మిగిలిన వారందరి పాత్రలు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యంగా ప్రభాస్ నటించిన రుద్ర పాత్ర సినిమాకు చాలా హైలెట్ అయిందని తమ్మారెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇక ఈ వ్యాఖ్యల పట్ల మంచు విష్ణు స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
