హైపర్ ఆది మీద ఎలాంటి దాడి జరగలేదు.. ఇదిగో సాక్ష్యం.!

Hyper Aadi Says No One Attacked Him | Telugu Rajyam

హైపర్ ఆది.. బుల్లితెరపైనే కాదు, పెద్ద తెరపై కూడా ఈ పేరు సుపరిచితమే. జబర్దస్త్ షో నుండి కమెడియన్‌గా పరిచయమై, తనదైన పంచ్ డైలాగులతో బుల్లితెరపై అనతి కాలంలోనే మంచి పేరు దక్కించుకున్నాడు హైపర్ ఆది. ఆ వెంటనే సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకున్నాడు. పంచ్ డైలాగ్స్ రైటర్‌గానే కాదు, నటుడిగానూ పెద్ద తెరపై బాగా పాపులర్ అయ్యాడు.

అయితే, ఈ మధ్య ‘మా’ ఎలక్షన్స్‌లో భాగంగా, మంచు విష్ణు అక్కడక్కడా కొన్ని కొన్ని పొరపాటు మాటలు దొర్లిన సంగతి తెలిసిందే. వాటిని తన స్కిట్స్‌లో తనదైన పంచ్‌ల కోసం హైపర్ ఆది వేడుసుకున్న సంగతీ తెలిసిందే. అయితే, హైపర్ ఆదికి ఇది అలవాటైన పనే.. కాదు కాదు, కొట్టిన పిండే.

సిట్యువేషన్ బట్టి, తన పంచ్‌ల కోసం వాళ్లనీ, వీళ్లనే తేడా లేకుండా, అందర్నీ తెగ వాడేస్తుంటాడు హైపర్ ఆది. ఇంతవరకూ ఈ విషయంలో ఎవరి మనోభావాలూ దెబ్బ తినలేదు. కానీ, మంచు వారి జోలికొస్తే అంతే సంగతి.. అందుకే మంచు విష్ణు అభిమానులు హైపర్ ఆదిపై దాడికి దిగారంటూ ఈ మధ్య గాసిప్స్ వినిపించాయి.

కానీ, అలాంటిదేమీ జరగలేదనీ తాను బాగానే ఉన్నాననీ, జబర్దస్త్ స్కిట్లతో, సినిమా ఛాన్సులతో బిజీగా ఉన్నాననీ హైపర్ ఆది తాజాగా సంజాయిషీ ఇచ్చుకుంటూ, జబర్దస్త్ షూటింగ్‌లో తన తోటి జబర్దస్థ్ కంటెస్టెంట్స్‌తో కలిసి ఉన్న ఫోటోలూ, వీడియోలూ సాక్ష్యంగా చూపించాడు.

అంతేకాదు, పాపం డబ్బుల కోసం ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వాళ్లకు కావాలంటే, తానే డబ్బులిస్తానంటూ ఓ ఓపెన్ స్టేట్ ‌‌మెంట్ కూడా పాస్ చేశాడీ పంచ్‌ల రారాజు హైపర్ ఆది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles