Allu Arjun: అల్లు అర్జున్ కు మరో భారీ ట్విస్ట్.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!

Allu Arjun: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ గొడవ సద్దుమణుగుతుంది అనుకుంటే అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అందులో భాగంగానే ఇప్పటికే చాలా రకాల పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేమిటంటే అల్లు అర్జున్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.

సంధ్య థియేటర్‌ ఘటనలో ఈ నోటీసులు ఇచ్చారు పోలీసులు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు అంశంపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఈసారి హైకోర్టు ఇచ్చిన మద్యంతర బెయిల్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ విచారణకు కూడా వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ యాక్టివిటీ ఉందంటూ పోలీస్ శాఖ భావిస్తోంది. అందుకే సీసీటీవీ ఫుటేజీ, ఘటన జరిగిన రోజు దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరిస్తోన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ కు మరోసారి నోటీసులు పంపడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనికంతటికి కారణం పుష్పటు సినిమా విడుదల రోజు జరిగిన సంఘటనే అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4వ తేదీని పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయంది. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఇక దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. సంధ్యా థియేటర్ నిర్వాహకులు, మేనేజర్లతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ను హఠాత్తుగా అరెస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా బన్నీ ఒక రోజు రాత్రంతా చంచల్ గూడ జైలులో గడిపాడు. ఆ మరుసటి రోజు విడుదలయ్యాడు. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ కు మళ్లీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.