వైఎస్ జగన్ ఒక పని అనుకుంటే చేసి తీరుతారనే పేరుంది. అధికారంలో లేనప్పుడే అనేకమార్లు మాట నెగ్గించుకున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వేగం మరింత పెంచారు. అనుకోవడమే ఆలస్యం క్షణాల్లో చేసి చూపిస్తున్నారు. జగన్ చేయాలని గట్టిగా డిసైడ్ అయిన పనుల్లో విశాఖను పాలన రాజధానిని చేయడం ఒకటి. చంద్రబాబు హయాంలో మొదలైన అమరావతిని కాదని జగన్ మూడు రాజధానుల విధానాన్ని తెరమీదకు తెచ్చారు. ఆ విధానంలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అదే గనుక జరిగితే అమరావతి మీద చంద్రబాబు పెట్టుకుని ఆశలన్నీ గల్లంతే. అందుకే ఆయన వివిధ రూపాల్లో అడ్డుతగిలారు. కోర్టు ద్వారా రాజధాని తరలింపు మీద స్టేటస్ కో తెచ్చారు.
ఆ స్టేటస్ కో ఇంకా నడుస్తూనే ఉంది. అయితే అది త్వరలోనే ఎత్తివేయబడుతుందని అదిఆకార పార్టీ వర్గాలు చాలా ధీమాగా ఉన్నాయి. ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొన్ని నెలల్లో విశాఖ నుండి పాలన్ మొదలవుతుందని అన్నారు. అంటే కోర్టులో విచారణ మొదలైతే తమకు అనుకూలమైన తీర్పు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు వైసీపీ నేతలు. ఒక్కసారి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరుసటి రోజే విశాఖ నుండి పాలన్ మొదలుపెట్టాలని యోచనలో ఉన్నారు జగన్. అందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు. శాఖలను విశాఖకు తరలించట్లేదు కానీ ఆయా శాఖలు పెట్టడానికి కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. అంటే ఉన్నపళంగా ఉద్యోగులను విశాఖలో కూర్చోబెట్టే ఏర్పాట్లన్నమాట.
దీనికోసం విశాఖ నగరంతోపాటు మధురవాడ, కాపులుప్పాడ, ఆనందపురం ప్రాంతాల్లో భవనాలను పరిశీలిస్తున్నారు. భీమిలి బీచ్‌రోడ్డులో గాయత్రి, గీతం విద్యా సంస్థల మధ్యన ఉన్న గిరిజన మ్యూజియం భవనాన్ని గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. కొన్ని ప్రధాన శాఖ ఏర్పాటు కోసం భారీ స్కూల్, కాలేజీ భావనాలను అధీకు తీసుకునే సంప్రదింపులు జరుగుతున్నాయి. జల వనరుల శాఖ ఉత్తరాంధ్ర సీఈ కార్యాలయ ఆవరణలో కృష్ణా బోర్డు కార్యాలయం, జల వనరుల శాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటుచేయాలని చూస్తున్నారు. మంత్రుల నివాసాలు, కార్యాలయాలకు కూడ భవనాల వెతుకులాట జరుగుతోంది.
స్టేటస్ కో అమలులో ఉన్నా ఈ పనులన్నీ అనధికారికంగానే జరిగిపోతున్నాయి. అధికారులు, లోకల్ లీడర్ల హడావుడితో విశాఖలో ఒకరకమైన అలజడి మొదలైంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ జోరుగా నడుతోంది. భూముల ధారాలజు రెక్కలొచ్చేశాయి. అసలే విశాఖలో ధరలు మండిపోతుంటాయి. అలాంటిది రాజధాని అంటే ఇంకెంత పెరిగుంటాయో ఊహించుకోండి.