ప్రస్తుత కాలంలో పిల్లలకి చిరుధాన్యాలు గురించి సరిగా అవగాహన లేదు. కానీ చిరుధాన్యాల వల్ల ఆరోగ్యానికి ఎన్నో పోషక విలువలు లభిస్తాయి. ముఖ్యంగా చలి కాలంలో నువ్వులు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.సాధారణంగా చలికాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. సమస్యల నుంచి మనల్ని రక్షించడానికి నువ్వులు కీలకపాత్ర పోషిస్తాయి. మరి నల్ల నువ్వులు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎప్పుడు మనం తెలుసుకుందాం.
చలికాలంలో నువ్వుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నవ్వులు చూడటానికి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. కానీ వాటిలో ఎన్నో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నువ్వులను ప్రతిరోజు బాగా నమిలి వాటిని కొంచెం గోరువెచ్చని నీటితో కలిపి మింగటం వల్ల హెమర్హాయిడ్స్ సమస్యను దూరం చేస్తుంది.నువ్వులు తినటం వల్ల హృదయ సంబంధిత వ్యాధులకు కూడా చెక్ పెట్టవచ్చును. నువ్వులలోని మంచి కొలెస్ట్రాల్ మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దగ్గు, జ్వరం తలనొప్పి జలుబు వంటి వాటిని కూడా అదుపు చేయవచ్చు.నువ్వులను తినటం మాత్రమే కాకుండా నువ్వుల నూనె వల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెవి నొప్పి ఉన్నవారు నువ్వుల నూనె, వెల్లుల్లి కలిపి గోరువెచ్చగా చేసి ఒకటి లేదా రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నువ్వుల నూనె జుట్టు పెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది.
నవ్వులు మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మనం ఆనందంగా ఉండటానికి కూడా చాలా ఉపయోగపడతాయి. నువ్వులు తినడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. నువ్వులను కొంచెం పచ్చిపాలలో వేసి బాగా పేస్ట్ చేసి మొఖానికి తీసుకోవడం వల్ల కాంతివంతంగా కనిపిస్తుంది. నువ్వుల నూనె మన శరీరం పొడిబారకుండా కాపాడుతుంది.