మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తక్షణమే తగ్గించే హోం రెమెడీస్?

మహిళల్లో వేధించే ఆరోగ్య సమస్యలలో పీరియడ్స్ సమస్య ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ప్రతినెల దాదాపు ఐదు రోజుల పాటు ఈ పీరియడ్స్ వల్ల మహిళలు ఎంతో బాధపడుతూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో మహిళలు కడుపునొప్పి, నడుము నొప్పి, వెన్నునొప్పి, కాళ్లు చేతులు లాగటం వంటి సమస్యలతో సతమతమవుతుంటారు . అయితే మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలలో పీరియడ్స్ సమయంలో వచ్చే అనారోగ్యం సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి నుండి విముక్తి పొందటానికి మహిళలు పాటించాల్సిన హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి విముక్తి పొందటానికి చాలామంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. కానీ టాబ్లెట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మన ఇంట్లో ఉండే వాముని ఉపయోగించి కషాయం చేసుకొని తాగడం వల్ల ఈ పీరియడ్స్ సమయంలో వచ్చే లోపు నుండి వేగంగా ఉపశమనం పొందవచ్చు. వాములో ఉండే ఎన్నో ఔషధ గుణాలు పీరియడ్స్ నొప్పిని తగ్గిస్థాయి.

అలాగే పీరియడ్స్ సమయంలో పుచ్చకాయ విత్తనాలను నెయ్యి లో వేయించి తినటం వల్ల నొప్పి నుండి విముక్తి లభిస్తుంది.

అంతేకాకుండా మన వంటింట్లో ఉండే జీలకర్ర కూడా పీరియడ్స్ నొప్పి తగ్గించటంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఒక స్పూన్ జీలకర్ర ఒక గ్లాస్ చక్కెర కలిపిన నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా చేయటం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి తొందరగా ఉపశమనం పొందవచ్చు.

ఇక పీరియడ్స్ సమయంలో కడుపు, వీపు, వెన్నెముక భాగంలో వేడి నీటితో కాపడం పెట్టుకోవాలి. లేదంటే ఇప్పుడు మార్కెట్ లో లభించే హీట్ బాగ్ తో బాగా కాపడం పెట్టుకోవటం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది.