నెయ్యి ఎక్కువగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నెయ్యి ఎక్కువగా తినడం వల్ల కొన్ని నష్టాలు చేకూరుతాయి. నెయ్యి ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెప్పవచ్చు. గుండె వ్యాధుల ప్రమాదంను నెయ్యి పెంచుతుందని చెప్పవచ్చు. అజీర్ణం, అసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, వికారం, తిమ్మిరి వంటివి నెయ్యి ఎక్కువగా తినడం వల్ల వస్తుంది.
నెయ్యిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. నెయ్యిలో అధిక కొవ్వు ఉంటుంది. ఇది కాలేయాన్ని ఒత్తిడికి గురి చేస్తుంది. నెయ్యిలో కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెయ్యి ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు ప్రభావితం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
జీర్ణ సమస్యలు ఉన్నవారు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అయితే గేదె పాలతో చేసిన నెయ్యితో పోల్చి చూస్తే ఆవు పాలతో చేసిన నెయ్యి ఆరోగ్యానికి మంచిదని చెప్పవచ్చు.
నెయ్యిలో 100 శాతం కొవ్వు ఉండగా ఈ నెయ్యిని ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అయితే నెయ్యిని పరిమితంగా తీసుకుంటే మాత్రమే హెల్త్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. నెయ్యి తీసుకోవడం ద్వారా ఎ, డీ, ఈ విటమిన్లు లభిస్తాయని చెప్పవచ్చు. నెయ్యి స్మోక్ పాయింట్ ఒకింత ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.