షుగర్ ని కంట్రోల్ చేసే హిమాలయ వెల్లుల్లి.. ఎలా చేస్తుంది.. అసలు అదెక్కడ దొరుకుతుంది?

మనం ప్రతిరోజు వంటకి ఉపయోగించే మసాలా దినుసులతో పాటు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా ప్రతిరోజు వాడుతుంటాం. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు డైరెక్ట్ గా తినడం లేదా కూరలో వేసి వండుకొని తినటం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

వెల్లుల్లి ప్రతిరోజు తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిలో ఆరోగ్యానికి అవసరమైన ఔషధగుణాలు ఉన్నాయి. దీనిలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల తరుచు వచ్చే జలుబు ,దగ్గు వంటి ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చు. ప్రతి రోజు 3 లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలను నమిలి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. హిమాలయన్ గార్లిక్ అనే ఒక రకమైన వెల్లుల్లి వల్ల అధిక బరువును తగ్గించవచ్చు. హిమాలయన్ గార్లిక్ మన శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించి వేరే ఇతర ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న నయం చేస్తుంది.

గార్లిక్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ సమస్యలను కూడా అరికట్టవచ్చు. వెల్లుల్లి యాంటీవైరల్, యాంటీ ఫంగల్ ,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం అల్లం మరియు వెల్లుల్లి దంచి వాటిని నీటిలో ఉడికించి ఆ నీటిని త్రాగటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మరి ఈ హిమాలయన్ వెల్లుల్లి మనకు మార్కెట్లో విరివిగా లభిస్తుంది.