Sai Pallavi: హీరోయిన్ సాయిపల్లవి రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్ళబెడతారు.!

Sai Pallavi: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమా ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి హీరోయిన్ సాయి పల్లవి. తెలుగు , తమిళం, మలయం చిత్రాలలో నటించి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిదా సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్న సాయిపల్లవి ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవికి క్రేజ్ మామూలుగా లేదు.

సాయి పల్లవి తెలుగు , తమిళం , మలయాళంలో టాప్ హీరోలతో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నానితో కలిసి నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీ విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తన నటనతో , అభినయంతో అందరిని మెప్పించిన సాయిపల్లవి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే సాయిపల్లవి రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకు కోటి నుండి కోటి యాభై లక్షల దాకా తీసుకుంటున్నట్టు సమాచారం. సాయి పల్లవికి అందంతో పాటు మంచి హృదయం కూడా. తాను నటించిన సినిమాలతో ప్రొడ్యూసర్లకు నష్టం వస్తే తాను తీసుకున్న రెమ్యూనరేషన్ తగ్గించుకోవడంతో పాటు తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

సాయి పల్లవి ఎప్పుడు సినిమాలలో తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటుంది. సినిమాలలో తన పాత్రకి ఎక్స్పోజింగ్ ఉన్నట్టయితే వాటిని తిరస్కరిస్తుంది. ఈమె కేవలం డబ్బు కోసం మాత్రమే కాకుండా తనకు పాత్ర నచ్చితేనే సినిమాలో నటిస్తుంది. తన పాత్ర నచ్చకపోవడంతో ఇద్దరు స్టార్ హీరోలతో చేసే అవకాశాన్ని పోగొట్టుకొని ఎనిమిది కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. ప్రస్తుతం సాయి పల్లవి వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో సాయి పల్లవి పేదింటి అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు.