చలికాలంలో పెద్ద రిలీఫ్ కావాలంటే వెల్లుల్లి టీ తాగండి. వెల్లుల్లి కేవలం వంటకు రుచి ఇవ్వడమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తోంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ముఖ్యంగా యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా లభించడంతో పాటు ఆరోగ్యాన్ని పెంచే యాంటీబ్యాక్టీరియా కూడా వెల్లుల్లి టీలో ఉంటుంది.
ఇక వెల్లుల్లిని తినటం వల్ల కూడా మన శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి కూడా వెల్లుల్లి టీ ఎంతగానో దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు కూడా సలహాలు ఇస్తున్నారు. అయితే వెల్లుల్లి టీ తాగడానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. మరి అలాటప్పుడు వెల్లుల్లి టీ తాగలేని వారికీ మరో అవకాశం ఉంది. అదే జీలకర్ర రసం.
జీర్ణశక్తిని పెంచేదే జీలకర్ర రసం. శరీరంలో కెలొరీలను కరిగించటంలో జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు కొవ్వులు కరగటంతోపాటు, సులభంగా బరువు తగ్గవచ్చు. జీలకర్రలో ఉండే పీచు పదార్ధం మలబద్ధకాన్ని నివారించి విరోచనం సాఫీగా జరిగేలా చేయడంలో కూడా ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ సమస్య ఉన్నవారు తప్పనసరిగా జీలకర్ర రసాన్ని తాగితే బాగా ఉపయోగం. ముఖ్యంగా చలికాలంలో ఇవి ఎంతగానో రిలీఫ్ ఇస్తాయి.