Varun Sandesh: యాక్సిడెంట్ అయ్యి గడ్డం పగిలింది: వరుణ్ సందేశ్

Varun Sandesh: తన లైఫ్‌లో అత్యంత పెయిన్‌పుల్ ఘటన అంటే తన తాతగారు చనిపోవడమేనని నటుడు వరుణ్ సందేశ్ చెప్పారు. ఆయనకు మల్టీపుల్ బ్రెయిన్ సర్జరీ చేశారు. కానీ ఆయన దాని నుంచి బయటకు రాలేరని డాక్టర్లు చెప్పారని ఆయన అన్నారు. కానీ ఆ తర్వాత ఆయన బయటికొచ్చారు. నవలలు రాశారు, కథలు రాశారు అని ఆయన తెలిపారు. ఫస్ట్‌ టైం అప్పుడే తాను అయ్యప్ప మాల వేశానని ఆయన వివరించారు. ఆ తర్వాత 6,7 ఏళ్లు కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవించారని వరుణ్ చెప్పారు. నిజం చెప్పాలంటే ఆయన ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారని, కానీ ఎంత జాగ్రత్తలు పాటించినా కోవిడ్‌ కారణంగా ఆయన ఈ మధ్యే కనుమూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపోతే తాను చేసిన కుర్రాడు సినిమాలో తనకు ఎదురైన ఓ సంఘటనను వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సినిమాకు సంబంధించి ఓ సాంగ్ షూట్ చేస్తున్నపుడు ఆటోలో వేళాడుతూ ఉన్నపుడు తాను లిరిక్ పాడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 2009లో హైటెక్ సిటీ రోడ్డులో షూటింగ్ చేస్తున్నపుడు అప్పట్లో అంతా ఖాళీగా ఉంది అని ఆయన ఆనాటి రోజులను నెమరు వేసుకున్నారు.

ఇకపోతే అలా ఆటోలో సీన్ షూట్ చేస్తున్నపుడు సడెన్‌గా స్లిప్ అయ్యి కింద పడి పోయానని వరుణ్ సందేశ్ చెప్పారు. అప్పుడు తన గడ్డం భాగంలో చాలా గాయం ఏర్పడిందని పడగానే డైరెక్టర్ సందీప్ గున్నం, వేణు టిల్లు ఇంకా చాలా మంది వెంటనే వచ్చి ఆస్పత్రిలో చేర్చారని ఆయన తెలిపారు. ఆ టైంలో కుట్లు కూడా పడ్డాయని,అప్పుడు ఇంకా పక్కన ఎలాంటి వాహనాలు లేవని వివరించారు. అప్పుడు తనకనిపించింది జాగ్రత్తగా ఉండాలి కదా అని అనుకున్నానని ఆయన చెప్పారు. అక్కడ కాకుండా ఏ కన్నుకో, ముక్కుకో దెబ్బ తగిలితే చాలా కష్టం అయ్యేదని ఆయన తెలిపారు.