Health Tips: భోజనం చేశాక ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

Health Tips: మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, టెన్షన్స్ వల్ల చాలామంది అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి ఆహారపు అలవాట్ల వల్ల నిత్యం ఎంతో మంది కొత్త రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. సమయానికి సరైన తిండి తినక పోవటం వల్ల జీర్ణాశయ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. కరోనా వల్ల అందరి జీవితాలు ఒక్కసారిగా అతలాకుతలం అయ్యాయి. దీంతో అందరూ వారి ఆరోగ్యం పై దృష్టి పెట్టారు. అయితే సరైన సమయానికి ఆహారం తినకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూట అనేకమంది ఫాస్ట్ ఫుడ్ తినటం అలవాటు చేసుకున్నారు, దీనివల్ల అధిక శరీర బరువుతో పాటు ఇతర జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

శరీర ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది. మనం తినే ఆహారం సక్రమంగా జీర్ణం చేసి శరీరానికి అవసరమైన పోషకాలను అందజేయడంలో జీర్ణ వ్యవస్థ పనితీరు ముఖ్యమైనది. దీనితో పాటు శరీరానికి అవసరం లేని వ్యర్థాలను కూడా బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. తినే ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోతే గ్యాస్, అజీర్తి, కడుపు నొప్పి, మలబద్ధకం, ఎసిడిటీ, కిడ్నీ స్టోన్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ చిట్కాలు పాటించటం వల్ల మీ శరీరం జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడకుండా ఉంటుంది.

*నిత్యం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కి ముందు కొద్దిగా అల్లం రసం సేవిస్తే మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవడమే కాకుండా వాంతులు, అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి.
*తిన్న ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే సోంపు గింజలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సోంపు గింజల లో ఉండే అధిక ఫైబర్ జీర్ణాశయ సమస్యలను దరిచేరనివ్వదు.
*భోజనానికి ముందు పుదీనా జ్యూస్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది.
*ప్రతి రోజూ యాపిల్ పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దరిచేరవు.
*రాత్రి వేళ కొంచం తొందరగా భోజనం చేయటం వల్ల పడుకునే సమయానికి ఆహారం బాగా జీర్ణమవుతుంది.