Health Tips: వేసవికాలంలో తలనొప్పి సమస్య వేధిస్తోందా? ఈ జాగ్రత్తలు పాటించటం మంచిది..!

Health Tips: ప్రతినిత్యం అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్యలు తలనొప్పి సమస్య కూడా ఒకటి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల నోటిలో 60 శాతం మంది తరచూ తలనొప్పితో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు వేసవికాలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల తల నొప్పి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురవటం వల్ల తలనొప్పి సమస్య వస్తుంది. ఈ ఈ తలనొప్పి సమస్యను భరించలేక చాలామంది వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. కానీ ఈ తలనొప్పిని అదుపులో ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి. వేసవికాలంలో తలనొప్పి దరిచేరకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వేసవి కాలం శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండేలా శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా రోజుకు మూడు లేదా నాలుగు లీటర్ల నీటిని తాగటం వల్ల తల నొప్పి సమస్య దరిచేరదు. శరీరం హైలెట్ గా ఉండటంవల్ల తలనొప్పి మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాల వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

సాధారణంగా అందరూ పండ్లు తింటుంటారు. కానీ వేసవి కాలంలో పండ్లను జ్యూస్ లాగా చేసుకుని తాగటం మంచిది. నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు అంటే కర్భూజ, వాటర్ మిలన్ వంటివి ఎక్కువ తీసుకోవాలి. ఇంట్లో అప్పుడప్పుడు పల్చటి మజ్జిగ చేసుకొని అందులో కలాకండ్ కలుపుకొని తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి తలనొప్పి సమస్య దరి చేరాదు.

వేసవి కాలంలో బయట మార్కెట్ లో దొరికే కూల్ డ్రింక్స్ వంటివి తాగకుండా ప్రతిరోజు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభించటం కాకుండా ఎక్కువ సేపు నీరసం రాకుండా ఉంటుంది. వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఇంట్లో ఏసీ గదుల్లో టీవీ,ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఎక్కువ సమయం ఇలా ఒకే గదిలో ఉండటం వల్ల కూడా తల నొప్పి వస్తుం ది వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు గంధం తలకు అంటించటం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి తలనొప్పి కూడా తగ్గుతుంది.