Health Tips: నువ్వుల పాలు ఎప్పుడైనా తాగారా?వీటిని తాగటం వల్ల కలిగే ఉపయోగాలు ఎన్నో..!

Health Tips: సాధారణంగా మనందరికీ ఆవుపాలు, గేదెపాలు, మేకపాలు వంటి అనేక రకాల పశువుల పాల గురించి తెలిసే ఉంటుంది. ప్రతి రోజూ పాలు తాగటం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. అందువల్ల పాలను మంచి పౌష్టిక ఆహారంగా పరిగణిస్తారు. పాలల్లో ఉండే అనేక రకాల పోషక పదార్థాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కానీ కొంతమందికి మాత్రం పాలను తాగటం ఇష్టం ఉండదు. అలాంటి వారు ఈ నువ్వుల పాలను తాగటం వల్ల పశువుల పాలకు సమానమైన పోషకాలు లభిస్తాయి.

ఈ నువ్వుల పాలు తాగటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నువ్వులను బాగా నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక మెత్తని క్లాత్ లో వేసి గట్టిగా పిండి పాలు తీయాలి. ఈ పాలు మరిగించే అవసరం లేకుండా అలానే తాగవచ్చు. ఈ నువ్వుల పాలలో క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పాలు తాగటం వల్ల ఇందులో ఉండే క్యాల్షియం శరీరంలోని ఎముకలు దంతాలను దృడంగా ఉండేలా చేస్తాయి.

నువ్వుల పాలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరిచే మలబద్ధకం అజీర్తి వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తకుండా చేస్తుంది. ఈ నువ్వుల పాలలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతాయి. అంతేకాకుండా నువ్వులతో తయారుచేసిన పాలలో కూడా అధికంగా ఉంటాయి. మాంసాహారం తో సమానమైన ప్రోటీన్లు ఈ నువ్వుల పాలలో లభిస్తాయి. మాంసాహారం తినేవారు ప్రతి రోజు ఒక కప్పు నువ్వులతో తయారుచేసిన పాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు లభిస్తాయి.