సైలెంట్ గా ఉంటూ జగన్ కి జన్మలో మరిచిపోలేని దెబ్బకొట్టిన గల్లా జయదేవ్

Political

అమరావతినే రాజధానిగా ఉంచాలని టీడీపీ నాయకులు, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ప్రజలకు కూడా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం కంటే ఎక్కువగా రాజధానిపై కోర్ట్ లు ప్రకటించే తీర్పులకోసం వైట్ చేస్తున్నారు.

గవర్నర్ ఆమోదముద్ర వేసిన బిల్లుపై రాష్ట్ర హై కోర్ట్ స్టేటస్ కో విధించింది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం మధ్య, అమరావతి రైతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎంపీ గల్లా జయదేవ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు. పొలిటికల్ మ్యాప్ఆఫ్ ఇండియాలో అమరావతిే ఏపీ రాజధాని అని సర్వే ఆఫ్ ఇండియా తాజాగా మ్యాప్ విడుదల చేసింది. పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఏపీ రాజధానిగా అమరావతి ఉందని అమరావతి రాజధాని అని మ్యాప్ లో చేర్చామని సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. 2019 నవంబర్ 21న లోక్‍సభలో టీడీపీ ఎంపీగా గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు తాజాగా ఆగస్టు 18న సర్వే ఆఫ్ ఇండియా సమాధానం పంపింది. 9వ ఇంగ్లిషు ఎడిషన్ 2019లోనూ 6వ హిందీ ఎడిషన్ 2020లోనూ అమరవాతిని ఏపీ రాజధానిగా పొందుపరిచామని తెలిపింది.

గత ఏడాది రిలీజ్ చేసిన ఇండియా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరును సర్వే ఆఫ్ ఇండియా చేర్చలేదు. ఇండియా మ్యాప్లో అమరావతిని చూపించకపోవడం వివాదాస్పదమైంది. ఇలా చేయడం ఏపీ ప్రజలను అమరావతికి శంకు స్థాపన చేసిన ప్రధాని మోడీని అవమానించడమేనని ఎంపీ హోదాలో నాడు జయదేవ్ పార్లమెంటులో ప్రస్తావించారు. అమరావతితో కూడిన మ్యాప్ను రిలీజ్ చేయాలని అన్నారు. ఆ మరుసటి రోజే.. కేంద్రం విడుదల చేసిన కొత్త మ్యాప్ ను కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. రాజధాని కోసం రాష్ట్రంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ సర్వే ఆఫ్ ఇండియా ఇండియా విడుదల చేసిన మ్యాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గురి చేసి జయదేవ్ జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు.