2019 ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ప్రకటించి, టీడీపీ పతనానికి విశ్వ ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లి మరీ కేసీఆర్ ను కలిశారు. చాలా స్నేహంగా ఉన్న కేసీఆర్- జగన్ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వ్యవసాయ విద్యుత్ విద్యుత్ కనెక్షన్స్ కు మోటార్స్ బిగించడం అనే అంశం ఇప్పుడు కేసీఆర్ -జగన్ మధ్య చిచ్చు పెడుతుంది.
జగన్ కు మెచ్చుకున్న కేంద్రం
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి మీటర్ల బిగుంపు వ్యవహారంపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినంచిందనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు చూపు అద్భుతమని కేంద్ర మంత్రి కితాబులిచ్చారనీ వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేసుకుంటున్న విషయం విదితమే. అయితే ఇప్పుడు ఈ విషయంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందించిన విధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీస్తుంది.
రైతుల ప్రయోజనాలను తాకట్టు వైసీపీ
కేంద్రం, 4 వేల కోట్ల రూపాయలు ఇస్తామనేసరికి వైఎస్ జగన్ ప్రభుత్వం, రైతు ప్రయోజనాల్ని తాకట్టుపెట్టేసిందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం, రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు కేంద్రంతో ‘పోరుకి’ సై అంటోందని హరీష్‌రావు చెప్పుకొచ్చారు. మేం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను బిగించాలన్న కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించలేదు. డబ్బులు పోతే పోతాయ్.. రైతుల విషయంలో ఏమాత్రం కేంద్రానికి సాగిలా పడబోమని హరీష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. హరీష్ రావు చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క గొప్పతనం చెప్పుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులుగా ఉన్న కేసీఆర్-జగన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల శత్రువులుగా మరనున్నారు.