మ‌హానాడు ముగించుకుని స్మార్ట్ గా చెక్కేసిన తండ్రీకొడులు!

ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు అండ్ స‌న్ లోకేష్ విశాఖ గ్యాస్ బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమ‌తులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా మ‌హానాడు కార్య‌క్ర‌మానికి రెండు రోజుల ముందుగా ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాల అనుమ‌తుల‌కు ఆన్ లైన్ లో  ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్నారు. ఇరు రాష్ర్టాల డీజీపీలు బాధితుల్ని ప‌రామ‌ర్శించే దుకు వెళ్తున్నార‌ని అయ్యోపాపం అని అనుమ‌తులిచ్చారు. లాక్ డౌన్ ఉన్నా ఇద్ద‌రు ప్ర‌ముఖ వ్య‌క్తులు హాజ‌రైతే త‌లెత్తే ప‌రిణామాల‌ను  అంచ‌నా వేసి ధైర్యం చేసి, సెక్యురుటీ ఏర్పాటు చేసి  అనుమ‌తులిచ్చారు.

కానీ ఈ తండ్రీకొడుకులిద్ద‌రు చేసిన ప‌నేంటో తెలుసా? స‌్మార్ట్ గా అమ‌రావతి వ‌చ్చి త‌మ కార్యాల‌యంలో రెండు రోజుల మ‌హానాడు పండుగ‌ను ముగించుకుని హైద‌రాబాద్ చెక్కేసారు. దీంతో సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు అండ్ స‌న్ పై విమ‌ర్శ‌లు పోటెత్తుతు న్నా యి. ఎల్ జీ పాలిమ‌ర్స్ బాధితుల పేరు చెప్పి అనుమ‌తులు తీసుకుని బాబు కొడుకులిద్ద‌రు చేసిన ఘ‌న‌కార్యం ఇది అంటూ విమ‌ర్శిస్తున్నారు. విశాఖ టీడీపీ వ‌ర్గీయులు….ఆయ‌న‌కు అనుకూలంగా ఆందోళ‌న చేసిన‌వారు మా చంద్ర‌బాబు వ‌స్తాడు…ప‌రామ‌ర్శిస్తాడు అని ఎంతో ఆశతో క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూసిన వారంద‌రి ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి.

ఈ ఘ‌ట‌న‌తో బాబు అస‌లు రూపం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది? అంటూ వైకాపా నేత‌లు దుయ్య‌బెడుతున్నారు. చంద్ర‌బాబు సీఎం గా ఉన్న‌ప్పుడే రాష్ర్టంలో జ‌ర‌గ‌రానిది ఏదైనా జ‌రిగితే నిమ్మకు నీరెత్త‌న‌ట్లు వ్య‌వ‌రించిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. అలాంటింది ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు…ఆ ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఎన్ని రోజులు ఉంటుందో గ్యారెంటీ లేదు. అలాంట‌ప్పుడు గ్యాస్ బాధితుల్ని ప‌రామ‌ర్శిస్తారు? అని అనుకున్న వాళ్లు అంతా  ఫూల్స్ అయ్యారంటూ నెటి జ‌నులు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన‌ట్లు బాబాగార్ని అన్ని సార్లు అందలం ఎక్కించినంద‌కు నిజంగా ఏపీ ప్ర‌జ‌ల‌కు చేతులు జోడించి న‌మ‌స్కరించాల్సిందే అన్న మాట మ‌రోసారి గుర్తు చేస్తున్నారు.