Post Covid: కరోనా తగ్గిన తర్వాత కూడా దీర్ఘకాలిక లక్షణాలు తప్పవంటున్న నిపుణులు..!

Carona Virus: చైనాలో ఉద్భవించిన ఈ మహమ్మారి కరోనా వైరస్…. అనేక మంది జీవితాలను అతలాకుతలం చేసింది. మొదటి వేవ్ లో లాక్ డౌన్ వల్ల ఆకలిచావులు, రెండవ వేవ్ లో డెల్టా వేరియంట్ కారణంగా అనేకమంది మృత్యువాత పడ్డారు, మూడో వేవ్ లో మునుపటి రెండు వేవ్ ల అంత ప్రాణ నష్టం లేకపోయినా కరోనా బారిన పడి అనేక మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తిరిగి నాలుగవ వేవ్ రూపంలో దాని ప్రభావం చూపుతోంది. అందువలన తిరిగి కరోనా గురించి తెలుసుకోవలసిన అవసరం వచ్చింది.

కరోనా వాక్సిన్ వల్ల అనేక మంది కోవిడ్ బారిన పడినా కూడా త్వరగా కోలుకున్నారు. అయితే, కరోనా నుంచి కోలుకున్న కోడ్ బాధితుల్లో అనేక మంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం కోవిడ్ నుంచి కోలుకున్న దాదాపు 30 శాతం మంది లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు అని తేలింది. వైరస్ నుంచి బయటపడిన బాధితుల శరీరంలోని వైరస్ సంబంధిత సూక్ష్మ కణాల ప్రభావం తో లక్షణాలు అధికంగా ఉండే అవకాశం ఉంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా లాస్‌ఏంజెల్స్‌(UCLA) పరిశోధన ప్రకారం చాలామంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత తీవ్ర అలసటగా అనిపించడం, వాసన కోల్పోవటం, శ్వాస సంబంధిత వ్యాధులు వంటి దీర్ఘకాలిక లక్షణాల ఉంటున్నాయి అని నిర్ధారించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన వారిలో ఇది వరకే డయాబెటిక్, అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉండే వారిలోనే లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయని సైంటిస్ట్ లు తెలిపారు.

దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకీ పాజిటివిటి రేటు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే ఐదు రాష్ట్రాలకు హెచ్చరికలను జారీ చేసింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న చోట్ల పటిష్ట చర్యలను చేపట్టి…. వైరస్ వ్యాప్తి ని నివారించాలని సూచించింది. ఇప్పటికే కరోనా కొత్త కేసుల గురించి ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరం, యూపీ, హర్యానా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. ఈ లేఖలో కరోనా కు సంబంధించి టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలను అమలు చేయడం వంటివి పటిష్టంగా ఉండేలా చూడాలని రాజేష్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.